News March 25, 2025
NRPT: వారికి కలెక్టర్ WARNING

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. వారం రోజులలో పనితీరు మెరుగుపర్చుకుని, లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆమె ఆదేశించారు. సోమవారం నారాయణపేట స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో ఉట్కూరు, కోస్గి, నారాయణపేట, మద్దూర్, దామరగిద్ద మండలాల అధికారులతో ఉపాధి హామీ, హరితహారం, స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు.
Similar News
News March 29, 2025
‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి భారీగా దరఖాస్తులు

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 2 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 5వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగియనుండగా, ఏప్రిల్ 6 నుంచి 30 వరకు అప్లికేషన్లను పరిశీలించనున్నారు. జూన్ 2న మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తారు.
News March 29, 2025
నంద్యాల: ఉగాది సందర్భంగా ప్రత్యేక రైళ్లు

ఉగాది సందర్భంగా నంద్యాల మీదుగా రెండు రైళ్ల ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు-హుబ్లీ మధ్య ఈ రైళ్లను ఏర్పాటు చేశారు. ఈనెల 31న రాత్రి 8 గంటలకు గుంటూరు నుంచి హుబ్లీకి బయలుదేరే రైలు(07271) నంద్యాలకు రాత్రి 12:50 గంటలకు చేరనుంది. అలాగే వచ్చే నెల 1న ఉదయం 11 గంటలకు హుబ్లీ నుంచి గుంటూరుకు బయలుదేరే రైలు(07272) నంద్యాలకు రాత్రి 7:50 గంటలకు చేరనుంది.
News March 29, 2025
మెట్పల్లి మార్కెట్లో పసుపు ధరలు..

మెట్పల్లి వ్యవసాయ మార్కెట్‌లో నేటి పసుపు ధరలు ఇలా ఉన్నాయి. పసుపు కాడి క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 12,566, కనిష్ఠ ధర రూ. 9,211, పసుపు గోళ గరిష్ఠ ధర రూ. 11,888, కనిష్ఠ ధర రూ. 9,051, పసుపు చూర గరిష్ఠ ధర రూ. 9,452, కనిష్ఠ ధర రూ. 8,183లుగా పలికాయి. కాగా ఈ సీజన్లో మొత్తం కొనుగోళ్ళు 36,557 క్వింటాళ్లు కాగా, ఈ రోజు 325 క్వింటాళ్ల కొనుగోళ్ళు జరిగాయి.