News October 19, 2024

NRPT : విద్యారంగ బలోపేతానికి కృషి చేయాలి : టీపీటీఎఫ్ 

image

ప్రభుత్వ పాఠశాలలను సమగ్రంగా అభివృద్ధి చేసి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నారాయణమ్మ, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారిలు సూచించారు. నారాయణపేటలోని అంబేడ్కర్ భవన్‌లో విద్యారంగ సమస్యలు, సవాళ్లు, కర్తవ్యాలు అనే అంశంపై శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల సర్దుబాటు జీఓ వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Similar News

News October 19, 2024

MBNR: మరణ శాసనాలుగా మారుతున్న డీజేలు

image

డీజేలు మరణ శాసనాలుగా మారి ప్రాణాలు బలిగొంటున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ గంటల పాటు డీజేల వద్ద డ్యాన్స్‌లు చేస్తూ కుప్పకూలిపోతున్న ఘటనలు అనేకం. దసరా ఉత్సవాల్లో వనపర్తి జిల్లా అమరచింత మండలం మిట్టనందిమల్లలో 28 ఏళ్ల ఓ యువకుడు డీజే వద్ద డ్యాన్సు చేశాడు. ఇంటికి వచ్చి గుండెపోటుతో మృతి చెందాడు. అధిక శబ్దాలు ఇచ్చే డీజేలతో అనేక ప్రమాదాలు పొంచి ఉన్నందున వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది.

News October 19, 2024

జూరాల ప్రాజెక్టు 11 గేట్ల ద్వారా నీటి విడుదల

image

ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద వస్తోంది. వారం రోజులుగా స్వల్పంగా వస్తున్న ఇన్ ఫ్లో.. శుక్రవారం మరింత పెరిగింది. 75వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైనట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 11 క్రస్టు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి వివిధ రూపాల్లో మొత్తం 85,356 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

News October 19, 2024

పాలమూరు జిల్లా ‘CRICKET’ జట్ల ఎంపిక

image

మహబూబ్ నగర్ పట్టణంలోని అండర్-23 ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపికలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి (MDCA) ఎం. రాజశేఖర్ మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి దాదాపు 90 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 6 జట్లను ఎంపిక చేశామని, ఎంపికైన జట్లతో ఈ నెల 21 నుంచి 28 వరకు పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారితో తుది జట్టును ఎంపిక చేస్తామన్నారు.