News August 23, 2025
NRPT: వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి- ఎస్పీ

జిల్లాలో ఎక్కడ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసిన తప్పనిసరిగా పోలీసుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ శనివారం ప్రకటనలో తెలిపారు. https://policeportal.tspolice.gov.in/index.htm ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి సమాచారం ఇవ్వాలన్నారు. గణేష్ ఊరేగింపులో డీజేలకు అనుమతి ఉండదని అన్నారు. వినాయక మండపాల వద్ద ఎన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, భక్తులకు సౌకర్యాలు కల్పించాలని చెప్పారు.
Similar News
News April 5, 2026
HYDలో నెల్లూరు జిల్లా యువకుడి మృతి

హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదంలో నెల్లూరు జిల్లా యువకుడు చనిపోయాడు. కావలికి చెందిన పసుపులేటి పెంచాల దేశిత్(25) HYDలోని హఫీజ్‌పేట్ వద్ద ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఫ్రెండ్‌తో కలిసి బైకుపై శనివారం అల్విన్ కాలనీ వైపు బయల్దేరాడు. బైకును వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దేశిత్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. అతని ఫ్రెండ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
News April 5, 2026
భువనగిరి: కరెంట్ షాక్‌తో రైతు మృతి

మోత్కూరు మండలంలోని పాటిమట్ల గ్రామంలో విద్యుత్ షాక్‌తో రైతు దొండ కొమురయ్య (58) మృతి చెందారు. ఆదివారం ఉదయం తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన కొమురయ్య, మోటార్ స్విచ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యారు. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News April 5, 2026
HYD: GREAT.. గోల్డ్ మెడల్ కొట్టిన బేగం

ఇండియా స్కిల్స్ 2026లో లాజిస్టిక్స్ & ఫ్రైట్ ఫార్వార్డింగ్ విభాగంలో నగరానికి చెందిన మెహ్రునిషా బేగం గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఆమె ప్రయాణం కృషి, పట్టుదలకి నిదర్శనం. బేగంపేట డిగ్రీ కాలేజీ అలుమ్ని అయిన ఆమె ప్రస్తుతం కార్గోమాన్ లాజిస్టిక్స్‌లో పనిచేస్తున్నారు.


