News February 25, 2026
NRPT: వైద్య ఆరోగ్య శాఖ పై సమీక్షించిన కలెక్టర్

జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై నారాయణపేట కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జిల్లాలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక అర్బన్ హెల్త్ సెంటర్, 27 సబ్ సెంటర్లు,59 పల్లె దవాఖానాల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు. వైద్యంపై ప్రజల్లో విశ్వాసం కలిగేలా చికిత్సలు అందించాలని అన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు.
Similar News
News February 28, 2026
4న తిరుపతిలో జాబ్ మేళా

APSSDC ఆధ్వర్యంలో తిరుపతిలోని APSPDCL కార్పొరేట్ కార్యాలయంలో మార్చి 4న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. డిక్సన్ టెక్నాలజీస్, హీరో మోటార్ కార్ప్, అమర్ రాజా గ్రూప్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, అపోలో ఫార్మసీ, రాంకో సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ పాసైన అభ్యర్థులు అర్హులన్నారు.
News February 28, 2026
VKB: జిల్లాలో 78 మంది విద్యార్థుల ఎంపిక

వికారాబాద్ జిల్లాలో నేషనల్ మిన్స్ కం మెరిట్స్(NMMS) స్కాలర్షిప్‌నకు 78 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. పరీక్షకు 1,097 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 78 మంది ఎంపికయ్యారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు నాలుగేళ్లపాటు ప్రభుత్వం స్కాలర్షిప్స్ అందించనుంది. విద్యార్థులకు సంబంధించిన అన్ని అర్హత ధ్రువీకరణ పత్రాలను ఉన్నతాధికారులకు పంపించేందుకు జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టారు.
News February 28, 2026
కసాయి తల్లి.. కన్నబిడ్డనే చెత్తకుప్పలో పడేసింది!

సత్యసాయి జిల్లా: కన్నప్రేమ కరువైందో లేక కనికరం చచ్చిందో కానీ, సోమందేపల్లి మండలం నడింపల్లిలో ఒక పసికందు పురిటిలోనే అనాథగా మారింది. నవమాసాలు మోసి, రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చే అమ్మే ఆ పసి ప్రాణాన్ని చెత్తదిబ్బలో పడేసింది. శనివారం ఆ చిన్నారి ఏడుపు విని గ్రామస్థులు పరుగున వెళ్లి చూశారు. ప్రస్తుతం ఆ చిన్నారి హిందూపురం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.


