News April 2, 2025
NRPT: సన్న బియ్యంతో అన్నం పెడితే తినడానికి వస్తా: ఎమ్మెల్యే

రాష్ట్రంలోని పేద ప్రజల ఆకలి తీర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి అన్నారు. నారాయణపేట పట్టణంలోని అశోక్ నగర్ రేషన్ షాపు 37లో సన్న బియ్యం పంపిణీని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ సన్న బియ్యంతో అన్నం వండి పెడితే తినడానికి వస్తానని మహిళలతో అనడంతో తమ ఇంటికి రావాలని తప్పకుండా పెడతామని మహిళలు ఎమ్మెల్యేకు చెప్పారు.
Similar News
News September 19, 2025
కాకినాడ జిల్లాకు పేరు మార్చాలని డిమాండ్

పిఠాపురం మహారాజా రావు సూర్యారావు బహదూర్ పేరును కాకినాడ (D)కు పెట్టాలని అనపర్తి మాజీ MLA శేషారెడ్డి సూచించారు. తమ ఇన్స్టిట్యూషన్స్ & మహారాజా ఫౌండేషన్ ప్రతియేటా జాతీయ స్థాయి కథ, కవితా సంపుటాల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. విద్య, దళితుల కోసం ఆయన ఎంతో శ్రమించారన్నారు. శ్రీకృష్ణ దేవరాయల తర్వాత అదే స్థాయిలో ప్రజలను ఆదరించిన మహనీయుడి పేరును జిల్లాకు పెట్టాలని కోరారు. దీనిపై మీరేమంటారు.కామెంట్ చేయండి.
News September 19, 2025
KNR: ‘పాఠశాలల్లో విభిన్న పద్ధతుల్లో విద్యాబోధన’

కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా తయారు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (TLM) జిల్లాస్థాయి మేళాను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విభిన్న పద్ధతులను అనుసరించి విద్యాబోధన చేస్తున్నామన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులున్నారు.
News September 19, 2025
గట్టు: అజ్ఞాతం వీడినా ఇంటికి చేరని మావోయిస్ట్

మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యురాలు కల్పన @ పద్మ ఇటీవల అజ్ఞాతం వీడినా నేటికి స్వగ్రామానికి (గట్టు మండలం పెంచికలపాడు) చేరుకోలేదు. జనజీవన స్రవంతిలో కలిసిన ఆమె స్వగ్రామానికి వస్తుందని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు. ఆమె ఎక్కడ ఉన్నారు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. కుటుంబ సభ్యులు ఆచూకీ గురించి అధికారులను కలిసినట్లు సమాచారం. 45 ఏళ్ల క్రితం అడవి బాట పట్టగా ఈ నెల 13న పోలీసుల ఎదుట లొంగిపోయారు.