News November 13, 2025
NRPT: సమాచార కమిషనర్ల రాక

నారాయణపేటకు శుక్రవారం సమాచార కమిషనర్లు వస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు శ్రీనివాసరావు, మౌసిన పర్వీన్ కలిసి పౌర సమాచార అధికారులకు, అప్పీలేట్ అధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. అనంతరం పెండింగ్ అప్పీళ్లు పరిశీలించి పరిష్కరిస్తారని అన్నారు.
Similar News
News November 13, 2025
ఢిల్లీ పేలుడు: ఈ లేడీ డాక్టర్‌తో ఆ కిలేడీకి సంబంధాలు!

ఢిల్లీ పేలుడు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన Dr షహీన్‌కు పుల్వామా మాస్టర్‌మైండ్ ఉమర్ ఫరూఖ్ భార్య అఫీరాతో సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. అఫీరా, మసూద్ అజార్ చెల్లెలు సాదియా కలిసి షహీన్‌ను సంప్రదించినట్లు దర్యాప్తు వర్గాలు చెప్పాయి. భారత్‌లో జైషే మహిళా వింగ్ ఏర్పాటు చేసి మహిళలను రిక్రూట్ చేయాలని చెప్పినట్లు తెలిపాయి. 2019లో ఎన్‌కౌంటర్‌లో ఉమర్ హతమయ్యాడు.
News November 13, 2025
వరంగల్ కమిషనర్ పరిధిలో 110 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 110 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 57 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనాన్ని సైతం సీజ్ చేయడం జరుగుతుందని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.
News November 13, 2025
సిరిసిల్ల జిల్లాలో 236 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా వేయగా, అందులో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొత్తం 236 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు, సీసీఐ ఆధ్వర్యంలో మరో 5 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.


