News February 22, 2025

NRPT: సీఎం వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ డీకే అరుణ

image

నారాయణపేట ‘ప్రజా పాలన-ప్రగతి బాట’బహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి మోదీ పాలనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. మోదీ పాలనకు.. రేవంత్ పాలనకు నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనను ప్రజలు చూసి మూడోసారి బీజేపీకి అధికారం అందించారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన హామీలకే దిక్కు లేదని ఎంపీ డీకే అరుణ ఘాటుగా విమర్శించారు.

Similar News

News January 11, 2026

బాపట్ల: సగం కాలిన మృతదేహం కలకలం

image

కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలో సగం కాలిన మృతదేహం కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు.. గణపవరం పంచాయతీలో దేవుడు మాన్యం గ్రామ పరిసర ప్రాంత పొలాల్లో సగం కాలిన మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడు గణపవరం గ్రామానికి చెందిన దాస్ అనే వ్యక్తిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 11, 2026

జగిత్యాల: అక్షరాయుధంతో ఎదిరించిన అలిశెట్టి!

image

తెలంగాణ నేల గర్వించదగ్గ మహాకవి అలిశెట్టి ప్రభాకర్. <<18824184>>జగిత్యాల<<>> జిల్లాలో జన్మించిన ఆయన, అక్షరాన్నే ఆయుధంగా మలచుకుని సామాజిక అన్యాయాలపై పోరాడారు. ‘సిటీ లైఫ్’ పేరుతో HYD జనజీవనాన్ని తన కవితల్లో కళ్లకు కట్టారు. చిత్రకారుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, మినీ కవితా ప్రక్రియలో మేటిగా నిలిచారు. పేదరికం, అనారోగ్యంతో పోరాడుతూనే చివరి శ్వాసవరకు కలం వీడలేదు. నేడు ఆయన సాహిత్యం భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

News January 11, 2026

జగిత్యాల: అరుదైన కవి.. జయంతి, వర్ధంతి ఒకే రోజు!

image

నిర్భాగ్యుల గొంతుకైన కవి, తెలంగాణ శ్రీశ్రీగా పేరుగాంచిన జగిత్యాలకు చెందిన దివంగత అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి జనవరి 12 (1954–1993)ఒకే రోజు కావడం విశేషం. వృత్తి ఫొటో గ్రాఫర్. ప్రవృత్తి కవిగా సిటీలైఫ్, పరిష్కారం, వేశ్య, దృశ్యం, నిర్మొహమాటం, ఎర్రపావురాలు, రక్తరేఖ, కాలం గొలుసు, చురకలు వంటి అక్షర తూటాలను సమాజంపై సంధించిన ప్రభాకర్ తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక పేజీని సృష్టించుకుని పదిలపరుచుకున్నారు.