News August 10, 2025

NRPT: ‘సైబర్ మోసగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

image

సైబర్ మోసగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. పెరుగుతున్న అధునాతన టెక్నాలజీ వాడుకొని సైబర్ కేటుగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాడని చెప్పారు. ఫోన్లకు వచ్చే అనవసరపు లింకులు ఓపెన్ చేయకూడదని, అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఓటీపీ, ఏటీఎం కార్డు నంబర్ చెప్పకూడదని అన్నారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.

Similar News

News August 13, 2025

పులివెందుల: 2 కేంద్రాల్లో రీపోలింగ్

image

AP: పులివెందుల ZPTC ఉప ఎన్నికల్లో భాగంగా 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశించింది. అచ్చవెల్లి, కొత్తపల్లెలో ఇవాళ రీపోలింగ్ నిర్వహించనున్నారు. 3, 14 కేంద్రాల్లో ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది. ఈ కేంద్రాల్లో 2 వేల మంది ఓటర్లు ఉన్నారు. నిన్న జరిగిన పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాశ్ సహా వైసీపీ శ్రేణులు ఆరోపించిన విషయం తెలిసిందే.

News August 13, 2025

VKB: 72 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

భారీ వర్షాలతో రాబోవు 72 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. వికారాబాద్ జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చోట పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఉంటే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలన్నారు.

News August 13, 2025

MHBD కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

భారీ వర్షాల నేపథ్యంలో మహబూబాబాద్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో తెలిపారు. దీంతో జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ నెంబర్ 7995074803ను సంప్రదించాలని జిల్లా ప్రజలకు సూచించారు.