News February 2, 2025

NRPT: సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: SP

image

అధునాతన టెక్నాలజీని వాడుకొని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఏటీఎం, ఓటీపీ వివరాలు ఇవ్వకూడదని, ఫోన్లకు వచ్చే అనవసర లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. బ్యాంకు నుంచి వచ్చే ఫేక్ కాల్స్‌పై స్పందించొద్దని చెప్పారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News September 18, 2025

2030 నాటికి 1.14 లక్షల మందికి ఉపాధి: భట్టి

image

TG: గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడితో 20 వేల మెగావాట్ల రీ యూజబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ‘2030 నాటికి ఈ పాలసీతో 1.14 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. మహిళా సంఘాల ద్వారా 2 వేల మెగావాట్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం. ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం’ అని తెలిపారు.

News September 18, 2025

VKB: అత్త శ్రద్ధాంజలి బ్యానర్ తీసుకెళ్తూ అల్లుడు మృతి

image

VKB జిల్లా పుల్‌మద్ది గ్రామంలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన లక్ష్మి మరణించడంతో ఆమె శ్రద్ధాంజలి బ్యానర్‌ని అల్లుడు శ్రీనివాస్ పట్టణంలో ప్రింట్ చేసుకొని తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు గుంతలో బైక్ పడి కింద పడడంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం శ్రీనివాస్‌పై నుంచి వెళ్లింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అత్త, అల్లుడు మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

News September 18, 2025

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

image

AP: ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 10 రోజుల వరకు సభ నిర్వహించే అవకాశముంది. పంచాయతీరాజ్ సవరణ, AP మోటార్ వెహికల్ ట్యాక్స్, SC వర్గీకరణ, మున్సిపల్ చట్టాల సవరణ వంటి 6 ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముంది. సూపర్-6 మొదలు సాగునీటి ప్రాజెక్టుల వరకు 20 అంశాలపై చర్చించేందుకు TDP ప్రతిపాదించొచ్చు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకెళ్లాలని YCP నిర్ణయించుకున్నట్లు సమాచారం.