News April 5, 2025
NRPT: ‘హరితహారం చెట్లకు హాని జరగకుండా చదును చేసుకోండి’

నారాయణపేట జిల్లాలో రైతులు తమ పొలాలను చదును చేసే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న హరిత హారం మొక్కలు నిప్పుకు ఆహుతి అవుతున్నాయి. జిల్లాలోని లక్ష్మిపూర్ గ్రామ పరిధిలోని చిన్నజట్రం టూ బోయిన్‌పల్లి రోడ్డులో హరితహారం చెట్లకు కొందరు నిప్పు పెట్టారు. ఇలా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయని, రైతులు హరితహారం చెట్లకు హాని జరగకుండా చదును చేసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News April 5, 2025
విజయనగరం జిల్లాలో అనకాపల్లి వాసి మృతి

విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుపర్తి క్వారీ వద్ద శుక్రవారం ప్రమాదవశాత్తు జారి పడి నాతవరం మండలం చెర్లోపాలెంకు చెందిన చింతల సత్తిబాబు మృతి చెందాడు. గత కొంతకాలంగా క్వారీ పనుల నిమిత్తం అక్కడకు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం క్వారీలో పని చేస్తుండగా ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
News April 5, 2025
తిలక్ రిటైర్డ్ హర్ట్: ముంబైపై తీవ్ర విమర్శలు

తిలక్ వర్మను రిటైర్డ్ హర్ట్‌గా మ్యాచ్ మధ్యలోనే బయటకు పంపడంపై మాజీలు, క్రికెట్ ఫ్యాన్స్ ముంబై యాజమాన్యంపై మండిపడుతున్నారు. ఇది అతడిని అవమానించడమేనని ఫైర్ అవుతున్నారు. తిలక్ స్థానంలో వచ్చిన శాంట్నర్ ఎన్ని సిక్సులు కొట్టాడని ప్రశ్నిస్తున్నారు. శాంట్నర్‌కు హార్దిక్ చివరి ఓవర్లో ఎందుకు స్ట్రైక్ ఇవ్వలేదని నిలదీస్తున్నారు. GTపై ఫెయిలైన పాండ్యను ఎందుకు రిటైర్డ్ హర్ట్‌గా పంపలేదని దుమ్మెత్తిపోస్తున్నారు.
News April 5, 2025
HYD: మైనర్లు వాహనాలు నడిపితే.. రిజిస్ట్రేషన్ రద్దు

HYD ట్రాఫిక్ పోలీసులు నేటి నుంచి మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించనున్నారు. ‘మోటారు వెహికిల్ యాక్ట్ ప్రకారం మైనర్ డ్రైవింగ్ నేరం. వాహన రిజిస్ట్రేషన్‌ను 12 నెలల పాటు రద్దు చేస్తారు. మైనర్‌కి 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ అర్హత ఉండదు. తల్లిదండ్రులు, వాహన యజమానులు దీనికి బాధ్యులు అవుతారు’ అని హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ విజ్ఞప్తి చేశారు.