News September 11, 2025
NRPT: హ్యాండ్లూమ్ భవన్ నిర్మాణ పనుల పరిశీలించిన అధికారులు

దసరాలోపు హ్యాండ్లూమ్ ఎక్సలెన్స్ భవనం పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట పట్టణ శివారులో నిర్మిస్తున్న సెంటర్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఎక్స్లెన్స్ భవన నిర్మాణ పనులను గురువారం సందర్శించి రివ్యూ చేశారు. బ్యాలెన్స్ పనులు తొందరగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో టీజీ ఎంఎస్ ఐడీసీ ఈఈ రతన్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 11, 2025
అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ ప్రజా సమస్యలను తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
➤ కె.కోటపాడు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ
➤ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
➤ అనకాపల్లి బెల్లానికి దేశ వ్యాప్త గుర్తింపు: ఎంపీ రమేశ్
➤ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన స్పీకర్
➤ తాళ్లపాలెంలో అభివృద్ధి పనులును ప్రారంభించిన MLA కొణతాల
➤ జగన్‌కు పేరు వస్తుందనే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం
News September 11, 2025
VZM: జిల్లాకి చేరుకున్న 39 మంది యాత్రికులు

మానస సరోవర యాత్రకు వెళ్లి నేపాల్‌లో చిక్కుపోయిన జిల్లాకు చెందిన యాత్రికుల్లో 39 మంది గురువారం క్షేమంగా చేరుకున్నారు. వీరికి విశాఖ విమానాశ్రయం వద్ద ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారి, బేబీ నాయన స్వాగతం పలికి వారి యోగక్షేమాలను విచారించారు. తమ స్వస్థలాలు చేరుకునేందుకు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ డి.మణికుమార్ ఏర్పాట్లు చేశారు.
News September 11, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ కృష్ణా: ఈ నెల 13న లోక్ అదాలత్
☞ గరికపర్రులో జిల్లా జూడో జట్లు ఎంపిక
☞ ఉమ్మడి కృష్ణాలో 70 శాతం స్మార్ట్ కార్డుల పంపిణీ
☞ మచిలీపట్నం విజయవాడ హైవే ప్రమాదం.. స్పాట్ డెడ్
☞ కృష్ణా: పెరిగిన గోల్డ్ రేట్స్.. భయపెడుతున్న దొంగతనాలు
☞ చల్లపల్లి పాఠశాల అన్నంలో పురుగులు
☞ చేవేండ్రలో దొంగతనం