News February 21, 2025

NRPT: 1000 మంది పోలీసులతో పటిష్ట భద్రత: ఎస్పీ

image

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1000 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం నారాయణపేటలోని ఓ ఫంక్షన్ హాలులో బందోబస్తుకు వచ్చిన పోలీసులకు భద్రతాపరమైన సలహాలు, సూచనలు చేశారు. పర్యటన ముగిసే వరకు అప్పగించిన విధులు పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. బందోబస్తును పది సెక్టార్లుగా విభజించి ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Similar News

News February 23, 2025

‘ఎంత పని చేశావ్‌రా నా కొడకా’ అంటూ సుహాస్ ఎమోషన్ పోస్ట్

image

తన ప్రాణ స్నేహితుడు మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ హీరో సుహాస్ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘అసలేమైందో నాకు కరెక్ట్‌గా తెలియదు. కానీ వాడు చాలా సంతోషంగా ఉండేవాడు. ధైర్యవంతుడు కూడా. కానీ ఇప్పుడు ఇలా.. ఎంత పని చేశావ్‌రా నా కొడకా’ అని రాసుకొచ్చి బ్రోకెన్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశారు. తన ఫ్రెండ్‌తో సరదాగా దిగిన ఫొటోలను షేర్ చేశారు.

News February 23, 2025

సత్యసాయి: HNSS ఫేస్-2 కాలువ మ్యాప్ పరిశీలన

image

హంద్రీనీవా సుజల స్రవంతి ఫేస్-2 సంబంధించిన కాలువ మ్యాప్‌ను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్లో హంద్రీనీవా సుజల స్రవంతి అధికారులు, 2వ విడతలో చేపట్టాల్సిన పనుల గురించి మ్యాప్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఫేస్-2 పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.

News February 23, 2025

ADB: విద్యార్థులకు అలర్ట్.. మోడల్ స్కూల్ దరఖాస్తులు

image

2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణ మోడల్ స్కూల్‌లలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని బోథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు (మిగిలిన సీట్లకు) దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 28వ తారీకు చివరి తేదీ అన్నారు. ప్రవేశ పరీక్ష తేదీ ఏప్రిల్ 13న ఉంటుందన్నారు. పరీక్ష ఫీజు SC, ST, BC, PHC& EWSలకు రూ.125, OC విద్యార్థులకు రూ.200 ఉంటుందన్నారు.

error: Content is protected !!