News March 22, 2025
NRPT: 18 మంది గైర్హాజరయ్యారు

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా శనివారం రెండో రోజు పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి గోవిందరాజులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 39 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 7,635 మందికి ఇందులో 8 మంది విద్యార్థులు మినహాయింపు ఇవ్వగా 7,609 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 18 మంది విద్యార్థులు వివిధ కారణాలతో పరీక్షలకు గైర్హాజరైనట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీ జరిపారు.
Similar News
News November 18, 2025
HYDలో టైఫాయిడ్, ఊపిరితిత్తుల కేసులు

HYDలో టైఫాయిడ్, ఊపిరితిత్తుల కేసులు పెరుగుతున్నాయి. గాంధీ, ఉస్మానియా, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రుల్లో 15 రోజుల్లోనే 18 మందికిపైగా టైఫాయిడ్, డయేరియా, శ్వాస సంబంధిత రుగ్మతలతో అడ్మిట్ అయినట్లు అధికారులు తెలిపారు. జ్వరం, తలనొప్పి, అలసట, కడుపునొప్పి, విరేచనాలు, శరీరంపై దద్దుర్లు ఉంటే ఆస్పత్రికి వెళ్లాలి. కాచి చల్లార్చిన నీళ్లు, మసాలా దినుసుల కషాయం తాగటం, ముక్కులోకి చల్లగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు.

కామారెడ్డి: ‘డబ్బు, మద్యం లేకుండా రాజకీయాల్లో రాణించాలి’

డబ్బు, మద్యం లేకుండా రాజకీయాల్లో రాణించాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వివిధ రాష్ట్రాల విద్యార్థులకు సోమవారం వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 25మంది రీసెర్చ్ స్కాలర్ విద్యార్థులతో ఎమ్మెల్యే పాల్గొని, యువత ప్రజలకు సుపరిపాలన అందించాలని సూచించారు. కామారెడ్డిలో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంను ఓడించడంపై పరిశోధన చేయనున్నట్టు విద్యార్థులు చెప్పారు.