News September 17, 2024
NRPT: 250 మంది పోలీసులతో బందోబస్తు
నారాయణపేట జిల్లా కేంద్రంలో నేటి అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే గణేశ్ శోభాయాత్రకు 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. గణేశ్ మార్గ్‌లో సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి సమీక్ష చేస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని వచ్చే వాహనాలను ఇతర మార్గాల ద్వారా డైవర్ట్ చేశామని అన్నారు. ప్రధాన కూడళ్లలో పోలీస్ పీకేటింగ్ ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News October 5, 2024
MBNR: బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హైదరాబాద్‌లో బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. భాగ్యనగరంలోని పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ ఆవరణంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా భావిస్తున్నాను అని ఎంపీ అన్నారు. బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలు అరుణమ్మను సన్మానించారు.
News October 5, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!
✒ఖమ్మంపై సంచలన విజయం.. ఫైనల్లోకి పాలమూరు జట్టు
✒మరో 4 రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
✒12న పాలమూరుకి సీఎం రేవంత్ రెడ్డి
✒రేపు మన్ననూరులో గద్దర్ విగ్రహవిష్కరణ
✒2వ రోజు ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
✒పలుచోట్ల బతుకమ్మ సంబరాలు
✒ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓటర్లు-23,22,054
✒సెలవులకు ఊరెళ్తున్నారా.. జాగ్రత్త:SPలు
✒DSC-2024..కొనసాగుతున్న ధ్రువపత్రాల పరిశీలన
✒ముమ్మరంగా డిజిటల్ కార్డు సర్వే
News October 4, 2024
MBNR: సంచలన విజయం.. ఫైనల్లోకి పాలమూరు జట్టు
ఓరుగల్లులో రాష్ట్రస్థాయి U-19 టోర్నీలో ఉమ్మడి MBNR జట్టు ఘన విజయం సాధించింది. శుక్రవారం సెమీస్‌లో ఖమ్మం జట్టుపై 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. జిల్లా బౌలర్ల దాటికి ఖమ్మం జట్టు 39.3 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌట్ అయింది. జిల్లా జట్టు నుంచి అబ్దుల్ రాఫె-110 పరుగులు, MD ముఖిత్ 4 వికెట్లు తీశారు.
#CONGRATULATIONS