News September 24, 2024

NRPT: BC విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

image

మహాత్మా జ్యోతిబాపులే విద్యానిధి పథకం- 2024 కింద BC,EBC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖాలీల్ తెలిపారు. అక్టోబరు 15వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్, నర్సింగ్, హ్యూమాని టీస్, సోషల్ సైన్స్ లో 60% మార్కులు పొందినవారు అర్హులన్నారు. వయసు 35,వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించకూడదన్నారు.

Similar News

News November 20, 2025

ఈనెల 23వ తేదీన జిల్లా కేంద్రంలో కబడ్డీ జట్ల ఎంపికలు

image

ఈనెల 23వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో స్త్రీ, పురుష కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బి.శాంత కుమార్, కురుమూర్తి గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఉదయం 9 గంటలకు జిల్లా స్టేడియం మైదానంలో రిపోర్టు చేయాలన్నారు. పురుషులు బరువు 85 కిలోల లోపు, స్త్రీలు 75 కిలోల లోపు ఉండాలన్నారు.

News November 20, 2025

కోయిలకొండ: ఎంపీడీవోల యూనియన్ అధ్యక్షుడిగా ధనుంజయ గౌడ్

image

మహబూబ్ నగర్ జిల్లాలో నూతన ఎంపీడీవోల యూనియన్ కార్యవర్గం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా (కోయిలకొండ) ఎంపీడీవో ధనుంజయ గౌడ్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షుడిగా (నవాబ్ పేట) ఎంపీడీవో జయరాం నాయక్, జనరల్ సెక్రటరీగా (MBNR) కరుణశ్రీ, కోశాధికారిగా (హన్వాడ) ఎంపీడీవో యశోదమ్మ, అసోసియేటెడ్ అధ్యక్షుడిగా (జడ్చర్ల) ఎంపీడీవో విజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా(భూత్పూర్) ఎంపీడీవో ఉమాదేవి, ఇతర సభ్యులను ఎన్నుకున్నారు.

News November 20, 2025

MBNR: రేపు డయల్ యువర్ RM

image

ఆర్టీసీ సమస్యలపై ‘డయల్ యువర్ RM ” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాలమూరు రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ “Way2News”తో తెలిపారు. ఈనెల 21న సాయంత్రం 4:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆర్టీసీ సమస్యలు, సూచనల కోసం 99592 26295కు సంప్రదించాలన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.