News January 25, 2025

NRPT: BC స్టడీ సర్కిల్.. APPLY చేసుకోండి

image

ఉమ్మడి MBNR బీసీ స్టడీ సర్కిల్లో RRB, SSC, బ్యాంకింగ్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు BC స్టడీ సర్కిల్ అభివృద్ధి అధికారి ఆర్.ఇందిర, డైరెక్టర్ ఎ.స్వప్న తెలిపారు. MBNR, NGKL, NRPT జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9లోగా www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 12,13,14న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News September 18, 2025

టెక్కలి: గ్రంథాలయాన్ని పరిశీలించిన జిల్లా అధికారి

image

టెక్కలి శాఖా గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకర్రావు గురువారం పరిశీలించారు. స్థానిక అధికారిణి రూపావతితో పలు అంశాలపై మాట్లాడిన ఆయన పలు రికార్డులను పరిశీలించారు. గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన సెస్ బకాయిలు వస్తే గ్రంథాలయాల అభివృద్ధికి దోహద పడతాయన్నారు. అనంతరం పాఠకులతో మాట్లాడారు.

News September 18, 2025

భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో వివిధ పరిశ్రమలు, విద్యాసంస్థలు, సంక్షేమ వసతి గృహాల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. భూ సేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించి, పరిశ్రమలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News September 18, 2025

చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ మృతి

image

పురుగు మందు తాగి ఆసుత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన కోళ్లపాలెంలో చోటుచేసుకుంది. గురువారం SI శివయ్య వివరాల మేరకు.. కోళ్లపాలెంకు చెందిన B. వాసుబాబు (35) స్థల వివాదం వల్ల మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. అతన్ని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.