News November 29, 2025
NRPT: BJP స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా కార్తిక రెడ్డి

నారాయణపేట జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్చార్జిగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఇన్చార్జిగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బండా కార్తీకారెడ్డిని నియమిస్తూ శనివారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణపేట జిల్లాలో బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తామన్నారు.
Similar News
News December 1, 2025
నెల్లూరు జిల్లాలో రేపు యథావిధిగా స్కూల్స్.!

నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో మంగళవారం యథావిధిగా స్కూల్స్ కొనసాగనున్నాయి. ‘దిత్వా’ తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురవడంతో సోమవారం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా డిసెంబర్ 2న మోస్తరు వర్షాలు కురవనుండడంతో యథావిధిగా విద్యా సంస్థలు కొనసాగించాలని DEO ఆదేశాలు జారీ చేశారు.
News December 1, 2025
పోలవరం ఆలోపే పూర్తి చేస్తాం: CM

పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అని, ఆ ప్రాజెక్టు మనకు ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం నల్లమాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2027 నాటికి గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో గోదావరి, కృష్ణా డెల్టాలో నీటి ఎద్దడి సమస్యే ఉండదన్నారు.
News December 1, 2025
తిరుపతి: రేపు పాఠశాలలకు సెలవు లేదు: డీఈవో

తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలలు మంగళవారం యథావిధిగా కొనసాగుతాయని డీఈవో కుమార్ తెలిపారు. దిత్వా తుఫాను ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎలాంటి సెలవు లేదని స్పష్టం చేశారు. ఎంఈవోలు, డీవైఈవోలు విద్యార్థులకు సమాచారం అందించి పాఠశాలలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.


