News March 8, 2025
NRPT: SALUTE మహిళలు.. అనుకుంటే అద్భుతాలే!

ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్కి చెందిన గోపాల్, వెంకటమ్మ దంపతుల నలుగురు కూతుర్లు చిన్నప్పటినుంచి కష్టాలు అధిగమించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. రూప PDగా, దీప SGTగా, శిల్పా వెటర్నరీ అసిస్టెంట్గా, పుష్ప PETగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి మహిళలకు ఆదర్శంగా నిలిచారు. మహిళలు అనుకుంటే అన్ని రంగాల్లో అద్భుతాలే అని నిరూపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా Way2News ప్రత్యేక కథనం.
Similar News
News November 16, 2025
కర్నూలు: 675 మందిపై కేసులు

జనవరి-అక్టోబర్ వరకు జిల్లా వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన 675 మంది మైనర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. మొదటిసారి పట్టుబడితే హెచ్చరికతో దండిస్తామని, రెండోసారి అయితే రూ.5 వేల జరిమానా విధిస్తున్నామని చెప్పారు. మద్యం తాగి డ్రైవింగ్ చేసిన మైనర్లతో పాటు వాహన యజమానులపైనా కేసులు నమోదవుతాయని హెచ్చరించారు.
News November 16, 2025
సంగారెడ్డి: నేడు ఉమ్మడి జిల్లా రైఫిల్ షూటింగ్ పోటీలు

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా రైఫిల్ షూటింగ్ బాలబాలికల అండర్-14, 17 సంగారెడ్డి లోని శాంతి నగర్ సెయింట్ ఆంథోనీ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఓపెన్ ఫైట్, పిప్ ఫైట్, పిస్తోల్ ఎంపికలు జరుగుతాయని చెప్పారు. ఒరిజినల్ బోనాఫైడ్, ఆధార్ కార్డుతో ఉదయం 9:30 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు.
News November 16, 2025
పశువులకు ‘ఉల్లి’తో సమస్య.. చికిత్స ఇలా

ఒక రోజులో పశువు తినే మొత్తం మేతలో 5 నుంచి 10 శాతానికి మించి ఉల్లిపాయలు ఉండకూడదని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా వారంలో 2-3 రోజులు మాత్రమే ఇవ్వాలన్నారు. ‘ఈ పరిమితి మించితే పశువుల కళ్లు, మూత్రం ఎర్రగా మారిపోతాయి. ఆహారం తీసుకోవు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుల సూచనతో విటమిన్ ఇ, సెలీనియం, ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు, లివర్ టానిక్లు, చార్కోల్ లిక్విడ్ లాంటివి అందించాలి.


