News October 25, 2025

NRPT: SIR జాబితా పకడ్బందీగా రూపొందించాలి

image

ఎస్‌ఐఆర్ ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైద్రాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. 2002 లో చేసిన స్పెషల్ సమ్మరీ రివిజన్ ఓటర్ జాబితా 2025 ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియను బూత్ స్థాయి అధికారుల సహకారంతో వేగంగా పూర్తి చేయాలని అన్నారు.

Similar News

News October 26, 2025

MBNR: BRS విజయం.. అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్

image

HYDలోని MTAR Technologies Ltd కంపెనీలో భారత రాష్ట్ర సమితి నుంచి కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికలలో భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పై గెలుపొందారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం పెట్టుకొని గెలిపించిన కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీలో కార్మికులకు ఉన్న ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

News October 26, 2025

అసలైన భక్తులు ఎవరంటే?

image

లాభాపేక్షతో భగవంతుణ్ని సేవించేవారు వ్యాపారస్తులు అవుతారు. వారు దేవుణ్ని తన వ్యాపార భాగస్వామిగా భావించి, ప్రతిఫలాన్ని ఆశిస్తారు. కానీ నిజమైన భక్తులు ఎలాంటి స్వార్థం, ఆశయం లేకుండా ‘నేనే నీ దాసుడను, నీవు నా స్వామివి’ అనే నిష్కల్మష భావనతో సేవలు చేస్తారు. ప్రతిఫలం ఆశించకుండా, మనస్సును భగవంతునిపైనే ఉంచి భక్తి చూపుతారు. స్వామి సంతోషమే తన సంతోషంగా భావించి, అందరిలోనూ ఆనందాన్ని నింపుతారు. <<-se>>#Daivam<<>>

News October 26, 2025

భగవంతుని నామస్మరణ గొప్పతనం ఏంటంటే..?

image

భగవంతుడి నామస్మరణ ఎంతో మహత్తరమైనది. ఆ నామాన్ని భక్తితో, వైరాగ్యంతో మాత్రమే కాక, కోపంతో, అలవాటుగా, అనాలోచితంగా పలికినా కూడా సకల శుభాలనూ, మోక్ష ఫలాలనూ అందిస్తుంది. భావనతో సంబంధం లేకుండా ఆ నామ సంకీర్తన నిరంతర శుద్ధిని కలిగిస్తుంది. అంతిమంగా జీవునికి మేలు చేకూర్చుతుంది. అందుకే ఆయన పేరుతో ఆయణ్ను దూషించినా.. అది దైవ నామ స్మరణే అవుతుందని పండితులు చెబుతుంటారు. భగవత్ నామానికి ఉన్న అద్భుత శక్తి ఇది.<<-se>>#Bakthi<<>>