News April 4, 2025
NRPT: ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

నారాయణపేట మండలం అప్పంపల్లి గ్రామంలో గత ఫిబ్రవరి 21న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. లబ్ధిదారు దేవమ్మ అనే మహిళ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కాగా శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆ ఇంటి నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీడీవో సుదర్శన్, పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అలాగే గ్రామంలోని షమీ బేగం, ఆశా బేగం ఇళ్లను పరిశీలించారు.
Similar News
News April 18, 2025
TGలో భారీ పెట్టుబడులు.. జపాన్‌లో సీఎం రేవంత్ ఒప్పందం

TG: రాష్ట్రంలో జపాన్‌కు చెందిన NTT డేటా సంస్థ రూ.10,500 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది. జపాన్ పర్యటనలో ఉన్న CM రేవంత్ ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. 25వేల జీపీయూలతో AI సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్‌ను లిక్విడ్ ఇమ్మర్షన్ టెక్నాలజీతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. తోషిబా అనుబంధ సంస్థ టీటీడీఐ కూడా HYD శివారు రుద్రారంలో రూ.592 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు సీఎం బృందంతో ఎంవోయూ కుదుర్చుకుంది.
News April 18, 2025
నేషనల్ హెరాల్డ్ కేసుతో BJPకి సంబంధం లేదు: బండి

నేషనల్ హెరాల్డ్ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ పునరుద్ఘాటించారు. 2011లో UPA ప్రభుత్వ హయాంలోనే సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిందన్నారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెయిల్ పొందారని పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి రూ.2 వేల కోట్ల ఆస్తులను కాజేసేందుకు వారు ప్రయత్నించారని ఆరోపించారు. వారికి చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు.
News April 18, 2025
మేడ్చల్: నూతన చట్టంపై 19 నుంచి సదస్సులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారాలు సరళతరం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతం తెలిపారు. జిల్లాలో మండల స్థాయిలో ఈ 19 నుంచి 26 వరకు ఈ అవగాహాన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ నూతన చట్టంపై అవగాహన పొందాలని కలెక్టర్ కోరారు.