News January 27, 2025
NRPT: కలెక్టరేట్ ప్రజావాణిలో 28 ఫిర్యాదులు

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 28
ఫిర్యాదులు అందాయని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డీవో రామచందర్ నాయక్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 13, 2025
ట్యాంక్ పైనుంచి దూకి యువకుడి సూసైడ్

సంజామల మండలం ఎగ్గోనిలో తాగునీటి సరఫరా కోసం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ పైనుంచి దూకి యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా ముద్దనూరు మండలం ఉప్పలూరుకు చెందిన కర్నాటి హర్షవర్ధన్ రెడ్డి(30) ఎగ్గోనిలోని తన సోదరి ఇంటికి 2 రోజుల క్రితం వచ్చాడు. అయితే మద్యానికి బానిసగా మారి, ఆరోగ్యం చెడిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 13, 2025
మెదక్: గవర్నర్లు మారారు తప్ప.. ప్రసంగాలు మారలేదు: హరీశ్‌రావు

అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లుగా అబద్ధాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్‌తో చెప్పించిందన్నారు. గవర్నర్ ప్రసంగంపై హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
News March 13, 2025
మార్చి 13: చరిత్రలో ఈ రోజు

* 1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం
* 1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
* 1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖెల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో హతమార్చాడు
* 1955: నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్ మరణం
* 1978: డైరెక్టర్ అనూషా రిజ్వీ జననం