News February 3, 2025

NRPT: క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన

image

నారాయణపేట జిల్లా ఆసుపత్రి ఆవరణలో సోమవారం ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్ మాట్లాడుతూ.. క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, క్యాన్సర్‌కు కారణమైన వాటికి దూరంగా ఉండాలని క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్సలు ప్రారంభించాలని చెప్పారు. న్యాయవాదులు, డాక్టర్లు పాల్గొన్నారు.

Similar News

News February 3, 2025

U19 WC టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్.. లిస్టులో నలుగురు భారత ప్లేయర్లు

image

U19 మహిళల WCలో సత్తా చాటిన 12 మంది ఆటగాళ్లతో ICC టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి త్రిషతో పాటు కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవిశర్మ చోటు దక్కించుకున్నారు.
జట్టు: త్రిష, బోథా(SA), పెర్రిన్(ENG), కమలిని, కావోయిహ్మ్ బ్రే(AUS), పూజా మహతో(NEP), కైలా రేనెకే(కెప్టెన్-SA), కేటీ జోన్స్(ENG), ఆయుషి శుక్లా, చమోడి ప్రబోద(SL), వైష్ణవి శర్మ, తాబిసెంగ్(SA).

News February 3, 2025

కడప: YVU పీజీ పరీక్షా ఫలితాలు విడుదల

image

వైవీయూ, అనుబంధ కళాశాలల ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం మూడో సెమిస్టర్ పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తమ చాంబరులో రిజిస్ట్రార్ ప్రొ పి.పద్మ, సీఈ ప్రొ కెఎస్వీ కృష్ణారావుతో కలిసి పీజీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం https:www.yvuexams.in/results.aspx అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. ఏసీఈలు డా.మమత, డా.శ్రీనివాసులు పాల్గొన్నారు.

News February 3, 2025

గ్రూప్-1 ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్

image

TG: గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో త్వరలోనే గ్రూప్-1 ఫలితాలు విడుదల కానున్నాయి.