News March 7, 2025
NRPT: క్రీడల్లో ప్రతిభ చూపిన కానిస్టేబుల్‌ను అభినందించిన ఎస్పీ

ఝార్ఖండ్ రాజధాని రాంచీ లో జరిగిన 68వ అల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో నారాయణపేట జిల్లాలో పని చేస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ గౌడ్ బాంబు డిస్పోజల్ టీమ్ నుంచి రూమ్ సెర్చింగ్ విభాగంలో ప్రతిభ చూపాడు. ఈ సందర్భంగా గురువారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ కానిస్టేబుల్‌ను అభినందించి ప్రశంస పత్రాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ ఎస్ఐ నరసింహ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 9, 2025
దుగ్గిరాల: వడదెబ్బకు గురై చిరువ్యాపారి మృతి

దుగ్గిరాల మండలం ఈమనికి చెందిన చిరువ్యాపారి మృతిచెందాడు. పులివర్తి సురేశ్ (45) ద్విచక్ర వాహనంపై అరటిగెలలు పెట్టుకుని పరిసర గ్రామాల్లో ప్రజలకు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం దుగ్గిరాల వెళుతున్నానని చెప్పి వెళ్లిన సురేశ్ పోస్టాఫీస్ సమీపాన బస్ షెల్టర్‌లో మృతిచెంది ఉన్నాడు. పోలీసులకు అందించిన సమాచారంతో కుటుంబసభ్యులు సురేశ్ మృతదేహాన్ని గుర్తించారు. వడదెబ్బకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు.
News March 9, 2025
రేపు అమలక ఏకాదశి.. ఏం చేయాలంటే?

ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశి ‘అమలక ఏకాదశి’. అమలక అంటే ఉసిరికాయ అని అర్థం. ఈరోజున విష్ణుమూర్తి ఉసిరి చెట్టులో నివాసం ఉంటారని నమ్మకం. అందుకే ఉపవాసం ఉండి ఉసిరి చెట్టును పూజిస్తే పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అన్నదానం, గోదానం, వస్త్రదానం, ఉసిరి, నల్ల నువ్వులు వంటివి దానం చేస్తే మంచిదని పేర్కొన్నారు. సాయంత్రం చంద్ర దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరమించవచ్చు.
News March 9, 2025
గూడూరు: గొంతులో పల్లీ ఇరుక్కొని బాలుడి మృతి

గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. 18 నెలల బాలుడు గుండెల అక్షయ్ ఆడుకుంటూ పల్లీ గింజ నోట్లో వేసుకున్నాడు. గొంతులో పల్లీ గింజ ఇరుక్కోవడంతో ఊపిరి ఆడక చనిపోయాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆడుతూ, పాడుతూ ఇంట్లో తిరిగే బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.