News March 15, 2025
NRPT: జిల్లాకు మంచి పేరు తేవాలి: డీఈవో

నారాయణపేట మండలం జాజాపూర్ మండల పరిషత్ పాఠశాలలో శనివారం డీఈవో గోవిందరాజు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తరగతుల శిక్షణకు ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. శిక్షణను పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు. సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 16, 2025
విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే: కలెక్టర్

మెదక్ పట్టణంలో గిరిజన మినీ గురుకులాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇక్కడ పరిశుభ్రతా చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యార్థుల శ్రేయస్సు, బోధనా సామర్థ్యాలు, ఆహార భద్రత, తదితరాల వంటి వాటిని పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని తెలిపారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మమేకమై వారి విద్యా ప్రతిభను పరీక్షించి పలు సూచనలు చేశారు.
News March 16, 2025
కమెడియన్లతో నటించేందుకు ఇష్టపడరు: సప్తగిరి

కమెడియన్లతో నటించేందుకు హీరోయిన్లు ఇష్టపడరని నటుడు సప్తగిరి అన్నారు. తాను ప్రధాన పాత్రలో నటించిన ‘పెళ్లి కాని ప్రసాద్’ మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడారు. ‘కమెడియన్ల పక్కన హీరోయిన్లు దొరకడం కష్టం. చాలా మంది కమెడియన్ పక్కనా? అంటారు. తన పక్కన నటించడానికి ఒప్పుకున్న ప్రియాంక శర్మకు ధన్యవాదాలు’ అని తెలిపారు. అలాగే, సినిమా వాళ్లకు ఎంత పేరొచ్చినా, మంచి అలవాట్లు ఉన్నా పిల్లను ఇవ్వరని తెలిపారు.
News March 16, 2025
పది విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం

ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్ రఫిక్ వెల్లడించారు. విద్యార్థులు ఆర్టీసీ బస్సు కండక్టర్లకు హాల్ టికెట్ చూపించి, 14 రోజుల పాటు ఉచితంగా ప్రయాణించే వెసలుబాటు కల్పించామన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.