News February 21, 2025
NRPT: జిల్లాలో నేడు CM పర్యటన వివరాలు

నారాయణపేట జిల్లాలో CM రేవంత్ రెడ్డి పర్యటన వివరాలు ఇలా.. మధ్యాహ్నం 12:55కు సింగారం ఎక్స్ రోడ్ వద్ద హెలిప్యాడ్ ల్యాండ్ కానుంది. 1:15కు జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్ పంప్‌ను ప్రారంభోత్సవం చేస్తారు.1:30కు అప్పక్ పల్లిలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు శంకుస్థాపన,1:50 GMC శిలాఫలక ఆవిష్కరణ, 2 గంటలకు వైద్య విద్యార్థులతో మాటామంతి, 2:10 సభా స్థలికి చేరుకుని ప్రసంగించనున్నారు.
Similar News
News February 22, 2025
మల్లన్న దంపతులకు కాణిపాక వినాయకుడి పట్టు వస్త్రాలు

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం దేవస్థానం నుంచి శ్రీశైలం మల్లన్న దంపతులకు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో శనివారం పట్టు వస్త్రాలను తీసుకొని వచ్చి శ్రీశైలం ఈవో శ్రీనివాసరావుకు అందించారు. అర్చకులు పండితులు, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు తీసుకున్నారు.
News February 22, 2025
BREAKING: బాలుడు అర్ణవ్ కన్నుమూత

TG: హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంటు లిఫ్టు-గోడకు మధ్య <<15540977>>ఇరుక్కున్న బాలుడు<<>> అర్ణవ్ కన్నుమూశాడు. తీవ్ర గాయాలతో నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. నడుము దగ్గర సర్జరీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
News February 22, 2025
విపక్షాల ట్రాప్‌లో పడొద్దు: భట్టి

TG: కులగణనలో వివరాలు ఇవ్వని వారి కోసం ప్రభుత్వం మరో అవకాశాన్ని ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీనిపై కుట్రలో భాగంగానే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. విపక్షాల ట్రాప్‌లో పడొద్దని ప్రజలకు సూచించారు. పారదర్శకతతో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.