News April 24, 2025

NRPT: ‘నకిలీ విత్తనాల అమ్మితే కఠినమైన చర్యలు’

image

నారాయణపేట జిల్లా పరిధిలోని ఆయా మండలాల్లో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేష్ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఊళ్లల్లోకి ప్యాకెట్లలో కాకుండా లూసుగా విత్తనాలు తీసుకొస్తే రైతులు తీసుకోవద్దని ఎస్పీ రైతులను కోరారు. ఫర్టిలైజర్ షాపుల్లో ప్యాకింగ్ లేబుల్ ఉన్న విత్తనాలు మాత్రమే కొనుక్కోవాలని రైతులను ఎస్పీ సూచించారు.

Similar News

News August 23, 2025

BSFలో 3,588 పోస్టులు.. నేడే చివరి తేదీ

image

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF)లో కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. టైలర్, కార్పెంటర్, ప్లంబర్, బార్బర్, స్వీపర్, ఎలక్ట్రీషియన్ తదితర ట్రేడ్లలో 3,588 జాబ్స్ భర్తీ చేయనుంది. మెన్‌కు 3,406, ఉమెన్‌కు 182 పోస్టులను కేటాయించింది. 10th పాసై ITI సర్టిఫికెట్ ఉన్నవారు అర్హులు. వయసు 18-25 ఏళ్లు. SC, ST, BC అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. <>rectt.bsf.gov.in/<<>>లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News August 23, 2025

నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని అంచనా వేసింది. మరోవైపు ఏపీలోని కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.

News August 23, 2025

సెప్టెంబర్ 4న మంత్రివర్గ సమావేశం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సెప్టెంబర్ 4న వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే పలు అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా సెప్టెంబర్ రెండో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం.