News August 30, 2024

NRPT: ‘పోలీసులు అప్రమత్తంగా ఉండాలి’

image

పోలీసులు తమ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లకు అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. పోలీసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రతినిధుల రక్షణ కొరకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, పరిసర ప్రాంతాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

Similar News

News September 30, 2024

జూరాల ప్రాజెక్టుకు తగ్గిన ఇన్‌ఫ్లో

image

జూరాలకు ఇన్ ఫ్లో తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం ఎగువ నుంచి 72 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు వివరించారు. 4 క్రస్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 5 యూనిట్లను కొనసాగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. గేట్ల ద్వారా, ఆవిరిరూపంలో, విద్యుదుత్పత్తి నిమిత్తం, కాల్వలకు ఇలా మొత్తంగా 68,647 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News September 30, 2024

నల్లమలలో టైగర్ సఫారీ రెడీ

image

నల్లమలలో నేటితో మూడు మాసాల నిషేధం ముగియనుంది. రేపటి నుంచి టైగర్ సఫారీ సేవలను అటవీశాఖ పున:ప్రారంభించనుంది. పర్యాటకులు టైగర్ స్టే నల్లమల పేరుతో ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. శ్రీశైలం వెళ్లి వచ్చే పర్యాటకుల కోసం ఆఫ్‌లైన్‌లో పరాహాబాద్ చౌరస్తా నుంచి సఫారీ వాహన సేవలను అందిస్తోంది. ఈ వాహనాల్లో వెళ్తూ అడవి అందాలను, పెద్దపులులు, చిరుతలు, వివిధ రకాల, జంతువులు, పక్షులను ప్రత్యక్షంగా చూడొచ్చు.

News September 30, 2024

MBNR: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
MBNR: 3239 121 1:27
NGKL: 3625 125 1:29
NRPT: 2683 137 1:19
WNP: 2137 53 1:40
GDWL: 2893 72 1:40