News March 7, 2025
NRPT: మూడు రోజుల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం

నారాయణపేట పట్టణ ప్రజలకు మూడు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేసినట్లు మున్సిపల్ కమిషనర్ బొగేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని సింగారం కూడలిలో తాగునీటి పైప్ లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా రేపు శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులు సరఫరా ఉండదని చెప్పారు. మరమ్మతులు శరవేగంగా కొనసాగుతున్నాయని, పట్టణ ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కమిషనర్ కోరారు.
Similar News
News March 9, 2025
సెలవు ఇవ్వలేదు.. సెలైన్ బాటిల్‌తోనే పాఠశాలకు వచ్చిన టీచర్

ఒడిశాలో ఒక ఉపాధ్యాయుడు సెలైన్ బాటిల్‌తోనే పాఠశాలకు వచ్చారు. ప్రకాశ్ భోయ్ అనే వ్యక్తి ఈనెల 6న తన తాత మరణించడంతో అంత్యక్రియలకు వెళ్లారు. అక్కడ అనారోగ్యానికి గురయ్యారు. సెలవు కావాలని కోరగా ప్రిన్సిపల్ నిరాకరించారు. దీంతో ప్రకాశ్ సెలైన్ బాటిల్‌తోనే విధులకు హాజరయ్యారు. వెంటనే తోటి ఉపాధ్యాయులు అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యాధికారి పేర్కొన్నారు.
News March 9, 2025
కరీంనగర్: సీపీగా బాధ్యతలు స్వీకరించిన గౌస్ ఆలం

కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్‌గా గౌస్ ఆలం ఆదివారం భాద్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన పోలీసు ఉన్నతాధికారుల బదిలీల్లో భాగంగా ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేసిన ఆయన కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా వచ్చారు.
News March 9, 2025
హిందూపురం: చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

హిందూపురంలోని ఆటోనగర్‌లో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 2- టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయాన్(14), హరిహన్(12) ఇద్దరు ఆటో నగర్‌లోని సడ్లపల్లి చెరువులో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు. బందువులు వారిని వెలికితీసి హిందూపురం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు.