News April 8, 2025

NRPT: మోడల్ కామన్ సర్వీస్ సెంటర్ స్థాపనకు దరఖాస్తులు ఆహ్వానం

image

రాజీవ్ యువ వికాస్ పథకం కింద మోడల్ కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కేంద్రాల స్థాపనకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కామన్ సర్వీ మేనేజర్ దిలీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు 70% నుంచి 80% ప్రభుత్వ సబ్సిడీ అందుతుందన్నారు. దరఖాస్తులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా చేసుకోవచ్చన్నారు. ISBలో డీటీపీ, కంప్యూటర్ సెంటర్, జిరాక్స్ సెంటర్ ఎంచుకోవాలన్నారు. పూర్తి వివరాలకు స్థానిక ఎంపీడీవో అధికారిని సంప్రదించాలన్నారు.

Similar News

News April 17, 2025

కరణం పురుషోత్తంరావుకు ఉగాది నంది పురస్కారం

image

తాండూరుకు చెందిన సీనియర్ రాజకీయ నేత, సామాజిక వేత్త, న్యాయవాది కరణం పురుషోత్తం రావు ఉగాది నంది పురస్కారం అందుకున్నారు. ఉజ్వల సాంకేతిక సేవా సంస్థ నిర్వహించిన ఉగాది నంది పురస్కారం, అవార్డులు-2025లో భాగంగా ఆయన ఎంపిక అయ్యారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని జయ ఇంటర్నేషనల్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పురుషోత్తం రావుకు ఉగాది నంది అవార్డు అందజేశారు.

News April 17, 2025

మందమర్రి: సింగరేణిలో ఉద్యోగాలు.. APPLY NOW

image

సింగరేణి ఆధ్వర్యంలో ఒరిస్సా రాష్ట్రంలోని నైని బ్లాక్‌లో బొగ్గు తవ్వకాలను చేపట్టిన యాజమాన్యం అక్కడ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. సింగరేణివ్యాప్తంగా గనులు, డిపార్ట్మెంటులో పనిచేస్తున్న ఉద్యోగులు ఈనెల 24 తేదీలోపు జీఎం (పర్సనల్) ఐఆర్, పీఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. సింగరేణిలో పనిచేస్తున్న క్లర్కులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

News April 17, 2025

ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ కీలక సమావేశం

image

బీజేపీ సంస్థాగత ఎన్నికలపై ఆ పార్టీ అగ్రనేతలు PM మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో జాతీయ అధ్యక్షుడి, పలు రాష్ట్రాలకు చీఫ్‌లను ఎన్నుకునే ప్రక్రియపై చర్చించినట్లు తెలుస్తోంది. APR 20 తర్వాత ఎప్పుడైనా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అటు, రాష్ట్రాల అధ్యక్షుల పేర్లు రెండు, మూడ్రోజుల్లో ప్రకటించనున్నట్లు సమాచారం.

error: Content is protected !!