News March 21, 2025

NRPT: రాజకీయ పార్టీలు సహకరించాలి: కలెక్టర్ 

image

ఓటరు జాబితా రూపకల్పన, నవీకరణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అర్హత ఉన్న వారిని ఓటరు జాబితాలో చేర్పించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని చెప్పారు.

Similar News

News March 31, 2025

తెలంగాణలో అతి తక్కువ ద్రవ్యోల్బణం

image

TG: దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైనట్లు NSO తెలిపింది. రాష్ట్రంలో ఇది 1.3 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. అలాగే కేరళలో అత్యంత ఎక్కువ ద్రవ్యోల్బణం (7.3 శాతం) నమోదైనట్లు పేర్కొంది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ (4.9%), కర్ణాటక, బిహార్ (4.5%), జమ్మూ కశ్మీర్ (4.3%)లో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్నట్లు పేర్కొంది. దేశంలోని 12 రాష్ట్రాలు 4 శాతం కంటే దిగువన ద్రవ్యోల్బణం నమోదు చేశాయి.

News March 31, 2025

రేపటి నుంచే ఇంటర్ తరగతులు

image

AP: రాష్ట్రంలో రేపటి నుంచే 2025-26 ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. సెకండియర్ విద్యార్థులకు మంగళవారం క్లాసులు మొదలు కానుండగా, ఫస్టియర్‌లో చేరే వారికి 7వ తేదీ నుంచి అడ్మిషన్లు స్టార్ట్ అవుతాయి. ఈ నెల 23 వరకు తరగతులు నిర్వహించి వేసవి సెలవులిస్తారు. జూన్ 2న తిరిగి క్లాసులు పున: ప్రారంభం కానున్నాయి. అలాగే జూ.కాలేజీల పని వేళలనూ ఉ.9గంటల నుంచి సా.5 వరకు పొడిగించి, 7 పీరియడ్లను 8 చేశారు.

News March 31, 2025

మెషిన్ కాఫీ తాగుతున్నారా?

image

రోజూ మెషిన్ కాఫీ తాగితే ఆరోగ్యానికి అనర్థమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కెఫీన్ బూస్ట్‌తో ప్రయోజనం కన్నా దుష్ప్రభావాలే ఎక్కువగా ఉంటాయి. మెషిన్ కాఫీలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే కేఫ్ స్టోల్, కహ్వియోల్, డైటర్పీన్స్ గుండెపై ప్రభావం చూపుతాయి. ఇవి ఫిల్టర్ చేయవు కాబట్టి కొలెస్ట్రాల్ పదార్థాలు అలాగే ఉండిపోతాయి. రోజూ 3 కప్పులకంటే ఎక్కువగా తాగేవారిలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

error: Content is protected !!