News February 4, 2025

NRPT: రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి హత్య

image

నారాయణపేట పట్టణంలో వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. సీఐ శివశంకర్ తెలిపిన వివరాలు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విక్రమ్ సింగ్ అనే వ్యక్తి టైల్స్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం ఐదుగురు పండ్ల వ్యాపారులు విక్రమ్ సింగ్‌ను గ్రౌండ్ లోకి తీసుకెళ్ళి కొట్టి చంపినట్లు చెప్పారు. మృతి చెందిన వ్యక్తి బావమరిది శివరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News February 4, 2025

KMR: ట్రాక్టర్ బోల్తా ఆరుగురికి గాయాలు

image

బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి శివారులో మంగళవారం కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందడంతో అంత్యక్రియల కోసం కట్టెలు తీసుకొని వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News February 4, 2025

బోనకల్‌లో సినీ నిర్మాత కేపీ.చౌదరి అంత్యక్రియలు

image

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన సినీ నిర్మాత కేపీ.చౌదరి సోమవారం ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక గోవాలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని ఈరోజు సాయంత్రం స్వస్థలమైన రాయన్నపేట గ్రామానికి తీసుకురానున్నారు. స్వగ్రామంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.

News February 4, 2025

జగిత్యాల: SI శ్వేత మృతి బాధాకరం: ఎస్‌పీ

image

గొల్లపల్లి చిల్వకోడూరు వద్ద కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ DCRBలో పనిచేస్తున్న ఎస్ఐ కొక్కుల శ్వేత మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్ఐ శ్వేత మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఆమె కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐ శ్వేత మృతి చాలా బాధాకరమని తెలిపారు. శ్వేత మృతి పట్ల పోలీస్ అధికారులు సంతాపం తెలియజేశారు.

error: Content is protected !!