News March 6, 2025
NRPT: రెండో రోజు పరీక్షలకు 71 మంది గైర్హాజరు

నారాయణపేట జిల్లాలో రెండో రోజు గురువారం ఇంటర్ పరీక్షలకు 71 మంది గైర్హాజరు అయ్యారని DIEO సుదర్శన్ రావు తెలిపారు. మొత్తం 3,803 మంది విద్యార్థులకు గాను, 3,732 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 71 మంది పరీక్షలకు హాజరు కాలేదని చెప్పారు. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లు తనిఖీలు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 7, 2025
వరంగల్ నగరంలో పోలీసుల పుట్ పెట్రోలింగ్

నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు భరోసా కల్పించే దిశగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వరంగల్ డివిజినల్ పోలీసులు ఏసీపీ నందిరాం నాయక్ నేతృత్వం పోలీసులు మండిబజార్, చార్ బోలి ప్రాంతాల్లో పుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు.
News March 7, 2025
పంజాబ్ కింగ్స్ న్యూ జెర్సీ చూశారా?

ఐపీఎల్ 2025 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. మెటాలిక్ ఎంబ్లమ్, గోల్డ్ కాలర్, గోల్డ్ ఫాయిల్ స్ట్రిప్స్, అథెంటిక్ లేబుల్‌తో జెర్సీ సరికొత్తగా ఉంది. రెడ్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ హెల్మెట్‌తో కిట్‌ను విభిన్నంగా రూపొందించారు. కాగా తమ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఆ ఫ్రాంచైజీ నియమించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఆయన జట్టును ముందుండి నడిపించనున్నారు.
News March 7, 2025
మార్చి 7: చరిత్రలో ఈరోజు

1921: తెలుగు సినిమా తొలి నేపథ్య గాయకుడు ఎమ్.ఎస్. రామారావు జననం
1938: నోబెల్ గ్రహీత, అమెరికా జీవశాస్త్రవేత్త డేవిడ్ బాల్టిమోర్ జననం
1952: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ జననం
1955: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ జననం
1952: ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద మరణం
1979: గ్రంథాలయోద్యమకారుడు అయ్యంకి వెంకటరమణయ్య మరణం