News March 9, 2025
NRPT: లోక్ అదాలత్ లో 9,825 కేసులు పరిష్కారం

నారాయణపేట జిల్లా కోర్టు పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మొత్తం 9,825 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ తెలిపారు. కేసులలో రాజీ అయిన వారికి పూల మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ప్రభుత్వానికి రూ. 24,08,020 ఆదాయం లభించిందని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గమని చెప్పారు. సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 10, 2025
నల్గొండ: స్వల్ప మెజారిటీతో అద్దంకి ఓటమి..!

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప మెజారిటీతో అద్దంకి దయాకర్ ఓడిపోయారు. ఈయన స్వస్థలం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామం. దయాకర్ జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. కాగా, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తుంటారని ఈయనకు పేరు.
News March 10, 2025
రాయచోటి: కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

రాయచోటి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదివారం తెలిపారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాగలరని తెలిపారు.
News March 10, 2025
విశాఖలో రౌడీ షీటర్స్‌కు కౌన్సెలింగ్

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు రౌడీషీటర్లకు సంబంధిత అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా SI సునీత ఆదివారం PMపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో పలువురు రౌడీ షీటర్స్‌ను సత్ప్రవర్తనతో వ్యవహరించాలని సూచించారు. ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.