News April 5, 2025

NRPT: ‘హరితహారం చెట్లకు హాని జరగకుండా చదును చేసుకోండి’

image

నారాయణపేట జిల్లాలో రైతులు తమ పొలాలను చదును చేసే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న హరిత హారం మొక్కలు నిప్పుకు ఆహుతి అవుతున్నాయి. జిల్లాలోని లక్ష్మిపూర్ గ్రామ పరిధిలోని చిన్నజట్రం టూ బోయిన్‌పల్లి రోడ్డులో హరితహారం చెట్లకు కొందరు నిప్పు పెట్టారు. ఇలా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయని, రైతులు హరితహారం చెట్లకు హాని జరగకుండా చదును చేసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Similar News

News April 5, 2025

జగిత్యాల: అంబేడ్కర్ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ

image

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 14 నిర్వహించే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్‌ను SC, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య శనివారం ఆవిష్కరించారు. జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఉత్సవాల కమిటీ జిల్లా ఛైర్మన్ భాస్కర్ ఉన్నారు.

News April 5, 2025

జగిత్యాల :పోలీస్ ప్రధాన కార్యాలయంలో డా.జాగ్జీవన్ జయంతి

image

జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జాగ్జీవన్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచారన్నారు. భారత సమాజ నిర్మాణంలో తనదైన ముద్ర వేశారన్నారు.

News April 5, 2025

జగిత్యాల: బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే

image

JGTL జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో స్వాతంత్ర్య సమరయోధుడు, బాబు జగ్జీవన్ రామ్ జయంతిని కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ నివాళులు అర్పించారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ వ్యవసాయ, రక్షణ రంగాల్లో కీలక సేవలు అందించారని, కార్మిక హక్కుల కోసం పోరాడారని అన్నారు. ఏడాదిలోగా జగిత్యాలలో విగ్రహం ఏర్పాటు చేస్తామని అడ్లూరి తెలిపారు.

error: Content is protected !!