News September 12, 2024

రష్యాలో NSA అజిత్ ధోవల్ స్పెషల్ మీటింగ్

image

భారత NSA అజిత్ ధోవల్, రష్యా సెక్రటరీ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్ సెర్గీ షోయిగు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఓవైపు బ్రిక్స్ NSAల సమావేశాలు జరుగుతుండగానే వీరిద్దరు భేటీకావడం గమనార్హం. పరస్పరం లబ్ధిచేకూర్చే అంశాలపై వీరు మాట్లాడుకున్నారని తెలిసింది. భారత్ తమలాగే ఆలోచించే భాగస్వామి అని, విశ్వాస ఆధారిత రాజకీయ అంశాలపై వీరిద్దరూ చర్చించారని ఢిల్లీలోని రష్యా ఎంబసీ ప్రకటించింది.

Similar News

News April 6, 2026

యుద్ధం.. పెరిగిన బిట్‌కాయిన్ ధర

image

పశ్చిమాసియాలో యుద్ధం విరమణకు ప్రయత్నాలు జరుగుతుండటంతో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మార్చి 25 తర్వాత తొలిసారి బిట్‌కాయిన్ ధర $70,000 మార్కును దాటింది. తర్వాత కొద్దిగా ఒడుదొడుకులకు లోనై ప్రస్తుతం $69,588 వద్ద ట్రేడవుతోంది. గతేడాది అక్టోబర్‌లో ఏకంగా $1,26,272కు చేరిన బిట్‌కాయిన్ ధర ఈ ఏడాది <<19063478>>ఫిబ్రవరిలో<<>> $60,033కు పడిపోయిన విషయం తెలిసిందే.

News April 6, 2026

భూమి నుంచి 4,06,773KM.. ఆర్టెమిస్-2 సరికొత్త చరిత్ర

image

నాసా చేపట్టిన ‘ఆర్టెమిస్-2’ మిషన్ స్పేస్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. భూమి నుంచి 4,06,773KM దూరానికి చేరుకొని అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్రగా నిలిచింది. 1970లో అపోలో-13 మిషన్ కంటే 2,500KM+ అధిక దూరం ప్రయాణించడం విశేషం. మరికొన్ని గంటల్లో వ్యోమగాములు చంద్రుడి సమీపానికి చేరుకొని చుట్టూ పరిభ్రమించనున్నారు.

News April 6, 2026

ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం కుమారుడికి జీవితఖైదు

image

హత్య కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు, జనతా కాంగ్రెస్ చీఫ్ అమిత్ జోగికి ఆ రాష్ట్ర హైకోర్టు జీవిత ఖైదు విధించింది. గతంలో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. 2003, జూన్ 4న NCP నాయకుడు విద్యాచరణ్ శుక్లా సన్నిహితుడైన రామావతార్ జగ్గీని పట్టపగలు కాల్చి చంపారు. ఈ కేసులో అమిత్ సహా 31 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. తర్వాత పలువురికి కోర్టులో ఊరట లభించింది.