News December 16, 2024
చైనాకు NSA అజిత్ దోవల్!
NSA అజిత్ దోవల్ త్వరలో చైనాలో పర్యటిస్తారని తెలిసింది. ప్రత్యేక ప్రాతినిధ్య చర్చల్లో పాల్గొంటారని సమాచారం. చివరిసారిగా 2020కి ముందు ఢిల్లీలో ఈ చర్చలు జరగడం గమనార్హం. ఆ తర్వాత గల్వాన్ వివాదం చెలరేగడంతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. ప్రస్తుతం సరిహద్దుల వద్ద యథాతథ స్థితి నెలకొనడం, సైనికుల ఉపసంహరణ పూర్తవ్వడంతో మళ్లీ మొదలయ్యాయి. బంగ్లా, మయన్మార్ అనిశ్చితి నేపథ్యంలో ఈ చర్చలు కీలకంగా మారాయి.
Similar News
News February 5, 2025
రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండలు
TG: రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో 32 నుంచి 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతూ వేసవిని తలపిస్తోంది. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఎండలు కాస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో వారంపాటు ఇవే ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేసింది. మరోవైపు హైదరాబాద్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. మీ ఏరియాలో ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News February 5, 2025
Way2Newsలో ఎక్స్‌క్లూజివ్‌గా ఎగ్జిట్ పోల్స్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కానున్నాయి. ఢిల్లీ పీఠం ఎవరిదనే దానిపై యాక్సిస్ మై ఇండియా, సీ ఓటర్, జన్ కీ బాత్, టుడేస్ చాణక్య వంటి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి. Way2Newsలో వేగంగా, ఎక్స్‌క్లూజివ్‌గా ఎగ్జిట్ పోల్స్ తెలుసుకోవచ్చు.
News February 5, 2025
కనిపించని కళాఖండానికి రూ.15లక్షలు!
కంటికి అద్భుతంగా కనిపించే కళాఖండాన్ని రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేయడం చూస్తుంటాం. కానీ, అసలు భౌతికంగా లేని ఓ ఆర్ట్‌ను $18,300 (రూ.15లక్షలు)కు కొనుగోలు చేశారు. ఇటాలియన్ కళాకారుడు సాల్వటోర్ గరౌ భౌతికంగా కనిపించని శిల్పాన్ని రూపొందించారు. అయితే ఇది భౌతికంగా కనిపించనప్పటికీ అక్కడ ఏదో రూపం ఉందనే భావనే కలుగుతోందని చెప్పుకొచ్చారు. దీనిని విక్రయించేందుకు వేలం నిర్వహించగా భారీ డిమాండ్ కనిపించింది.