News June 6, 2024
NSE ప్రపంచ రికార్డ్

నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఒక్కరోజులో అత్యధిక లావాదేవీలు నమోదు చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించింది. నిన్న NSE 1,971 కోట్ల ఆర్డర్లు హ్యాండిల్ చేసిందని, 28.55 కోట్ల లావాదేవీలు నమోదైనట్లు ఎక్స్‌ఛేంజీ సీఈఓ ఆశిష్ చౌహాన్ వెల్లడించారు. కాగా TDP చీఫ్ చంద్రబాబు, JDU చీఫ్ నితీశ్ కుమార్‌లు తమ మద్దతు NDAకే అని స్పష్టం చేయడం మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. దీంతో నిఫ్టీ నిన్న 735 పాయింట్ల లాభంతో ముగిసింది.
Similar News
News January 2, 2026
కవిత BRSలో ఉన్నారా.. ఏమి?: కోమటిరెడ్డి

TG: KCR శాసనసభకు వస్తే BRS పుంజుకుంటుందని కవిత పేర్కొనడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఆమె BRSలో ఉన్నారా? అనే అనుమానం వస్తోంది. కేసీఆర్‌ను ఉరితీసినా తప్పు లేదన్నందుకు రక్తం మరిగిపోతోందని ఆమె అంటున్నారు. అంటే కేటీఆర్, హరీశ్‌లను ఉరివేసినా ఫర్వాలేదా? కవిత కన్ఫ్యూజన్‌లో ఉండి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు’ అని విమర్శించారు. తన తమ్ముడితో తనకు విభేదాలు లేవని పేర్కొన్నారు.
News January 2, 2026
రూ.70 కోట్ల బడ్జెట్.. వచ్చింది రూ.2 కోట్లు!

మోహన్ లాల్ ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ ‘వృషభ’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రూ.70 కోట్లతో తెరకెక్కగా 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.2 కోట్లు మాత్రమే వసూలు చేసింది. VFX క్వాలిటీగా లేదని ఫస్ట్ డే నుంచే నెగటివ్ టాక్ రావడం సినిమా పాలిట శాపమైంది. బడ్జెట్‌లో కనీసం 10% కూడా రికవరీ అయ్యే అవకాశం లేదని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో 2025లో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా మిగిలింది.
News January 2, 2026
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ షురూ

AP: అమరావతి 2వ దశ ల్యాండ్ పూలింగ్‌కు రేపు నోటిఫికేషన్ జారీకానుంది. పెదపరిమి, వడ్లమాను, వెకుంఠాపురం, హరిశ్చంద్రాపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్ణపూడి, లేమల్లెల్లోని పట్టా, అసైన్డ్ భూమి 16,666.57 ఎకరాలు సమీకరిస్తారు. మరో 3828.56 ఎకరాల ప్రభుత్వ భూమి తీసుకోనున్నారు. FEB 28లోపు ప్రక్రియ పూర్తిచేస్తారు. కాగా 4 ఏళ్లలో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని, లేకుంటే ₹5L పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.


