News October 17, 2024

VIPలకు NSG భద్రత కట్

image

దేశంలోని వీఐపీలకు ఎన్‌ఎస్‌జీ భద్రతను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై వీరి భద్రతను సీఆర్‌పీఎఫ్ పర్యవేక్షిస్తుందని తెలుస్తోంది. జెడ్ ప్లస్ కేటగిరిలో చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, మాయావతి, సర్బానంద సోనోవాల్, అజాద్, ఫరూక్ అబ్దుల్లాకు భద్రత ఉపసంహరించనున్నారు. వీరి సెక్యూరిటీని CRPF చూసుకుంటుంది.

Similar News

News October 17, 2024

మరోసారి ‘నామినేటెడ్’ పండుగ?

image

AP: రాష్ట్రంలో మరోసారి నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 23న రెండో జాబితాను సీఎం చంద్రబాబు విడుదల చేస్తారని సమాచారం. ఈ సారి మహిళా నేతలకు భారీగా పదవులు దక్కే అవకాశముంది. టీడీపీకి 60 శాతం, జనసేనకు 30, బీజేపీకి 10 శాతం చొప్పున కేటాయించనున్నట్లు సమాచారం. ఈ పదవుల కేటాయింపు ముగిసిన వెంటనే టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించనుంది.

News October 17, 2024

కేసులు పరిష్కరించాకే గ్రూప్-1 పరీక్షలు పెట్టాలి: రాకేశ్ రెడ్డి

image

TG: కోర్టు కేసులన్నీ పరిష్కరించిన తర్వాతనే రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించాలని BRS నేత రాకేశ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘జీఓ 29 వర్సెస్ 55తోపాటు అనేక కేసులు ఉన్నాయి. ప్రభుత్వం వీటిని పరిష్కరించి పరీక్ష నిర్వహిస్తుందా? లేదా పట్టించుకోకుండా నిర్వహిస్తుందా? కోర్టు తీర్పు తర్వాత మళ్లీ మెయిన్స్ పరీక్ష పెడతారా? ఈ విషయంలో అభ్యర్థులు సందిగ్ధంలో ఉన్నారు’ అని ఆయన ట్వీట్ చేశారు.

News October 17, 2024

నేడు హరియాణా సీఎంగా సైనీ ప్రమాణస్వీకారం

image

హరియాణా సీఎంగా రెండోసారి నాయబ్ సింగ్ సైనీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభాపక్షం ఆయన పేరును ఏకగ్రీవంగా ఆమోదించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్లనున్నారు.