News November 20, 2025
NSIC లిమిటెడ్‌లో ఉద్యోగాలు

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్(NSIC) 5పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 3 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, CA/CMA,MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంజినీర్ పోస్టులకు గరిష్ఠ వయసు 31ఏళ్లు కాగా.. మేనేజర్‌కు 40 ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nsic.co.in/
Similar News
News March 29, 2026
IPL: టాస్ గెలిచిన MI

ముంబైలోని వాంఖడే స్టేడియంలో KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో MI టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
MI: రోహిత్, రికెల్టన్, తిలక్, హార్దిక్, రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్, మార్కండే, ఘజన్‌ఫర్, బౌల్ట్, బుమ్రా
KKR: అలెన్, రహానే, గ్రీన్, రఘువంశీ, రింకూ, రమణ్‌దీప్, అనుకుల్ రాయ్, నరైన్, వరుణ్, అరోరా, ముజరబానీ
News March 29, 2026
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఫలితాలు విడుదల

TG: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెరిట్ జాబితా విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 1న HYDలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఇందులో గైనకాలజీ, అనస్తీషియా వంటి కీలక విభాగాలున్నాయి. ఇక 2,312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను ఏప్రిల్ 9న వెల్లడిస్తామని రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఈ నియామకాలతో ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
News March 29, 2026
మహిళలకు రూ.2 వేలు, రైతులకు పంపుసెట్లు: DMK మ్యానిఫెస్టో

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అధికార డీఎంకే వరాల జల్లు కురిపించింది. మహిళలకు ప్రతి నెలా ₹2 వేలు ఇస్తామని ప్రకటించింది. పెన్షన్‌ను ₹2 వేలకు పెంచుతామని, రైతులకు ఉచితంగా పంపుసెట్లు అందజేస్తామని తెలిపింది. మహిళా సంఘాలకు ₹5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తామని పేర్కొంది. స్టూడెంట్లకు ఫ్రీగా ల్యాప్‌టాప్‌లు, 8వ తరగతి వరకు పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అమలు చేస్తామని వెల్లడించింది.


