News March 30, 2024

NSPT బస్టాండ్‌లోనే కన్నుమూసిన క్యాన్సర్ బాధితుడు

image

నర్సంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లోనే ఒకరు మృతి చెందారు. వరంగల్‌కు చెందిన మహ్మద్ అప్జల్(35) నర్సంపేటలో ఓ పండ్ల వ్యాపారి వద్ద కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న అప్జల్ వరంగల్‌కు వెళ్లి వస్తూ నర్సంపేటలో బస్సు దిగాడు. స్పృహ తప్పి బస్టాండులోనే నిద్రపోయాడు. ఆర్టీసి సిబ్బంది వచ్చి అతనిని నిద్రలేపడానికి ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు.

Similar News

News February 9, 2026

వరంగల్: ‘ఈనెల 11న వేతనంతో కూడిన సెలవు’

image

ఈనెల 11న పోలింగ్ నేపథ్యంలో వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో వేతనంతో కూడిన సెలవు కల్పిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించినట్లు ఆమె వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే ప్రభుత్వ భవనాల విద్యా సంస్థలకు ఈనెల 10, 11వ తేదీల్లో, 13వ తేదీ ఓట్ల లెక్కింపు రోజు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు.

News February 9, 2026

పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో మద్యం దుకాణాల మూసివేత: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ఎన్నికలు సజావుగా పూర్తయ్యేందుకు సహకరించాలని కోరారు.

News February 9, 2026

వరంగల్‌లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో పాటు ఎన్నికల జనరల్ అబ్జర్వర్ కిల్లు శివకుమార్ నాయుడు హాజరయ్యారు. మాస్టర్ ట్రైనర్ల ద్వారా మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల విధి విధానాలపై అవగాహన కల్పించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, సాగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.