News March 30, 2024

NSPT బస్టాండ్‌లోనే కన్నుమూసిన క్యాన్సర్ బాధితుడు

image

నర్సంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లోనే ఒకరు మృతి చెందారు. వరంగల్‌కు చెందిన మహ్మద్ అప్జల్(35) నర్సంపేటలో ఓ పండ్ల వ్యాపారి వద్ద కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న అప్జల్ వరంగల్‌కు వెళ్లి వస్తూ నర్సంపేటలో బస్సు దిగాడు. స్పృహ తప్పి బస్టాండులోనే నిద్రపోయాడు. ఆర్టీసి సిబ్బంది వచ్చి అతనిని నిద్రలేపడానికి ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు.

Similar News

News April 19, 2025

కాజీపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

image

మహిళా కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాజీపేటలోని దర్గా ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ అర్చనకు 2022లో వివాహం జరిగింది. కొద్ది రోజులకే ఆమెకు భర్తతో విడాకులు కావడంతో మానసికంగా బాధపడింది. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడింది.

News April 19, 2025

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మహబూబాబాద్ ఎంపీ

image

వరంగల్ మహానగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం మహా మండపంలో వేదపండితులు, అర్చకులు అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి మహదాశీర్వచనం నిర్వహించి తీర్ధ ప్రసాదములు అందజేశారు.

News April 19, 2025

వరంగల్: ‘అత్తాన, పోతాన’.. ఇదే మన యాస, భాష

image

ప్రాంతాన్ని బట్టి భాష మాట్లాడే తీరు ఉంటుంది. WGL, KNR జిల్లాల్లో మాత్రం భాష కాస్త భిన్నంగా ఉంటుంది. KNR వారు అకారంతో మాట్లాడితే WGLలో ఒకారంతో మాట్లాడతారు. KNRలో వడ్లు అంటే WGLలో ఒడ్లు అంటాం. వేరే జిల్లాల్లో వస్తున్నా, వెళ్తున్నా అంటే మనం మాత్రం ‘అత్తాన, పోతాన’ అంటుంటాం. అచ్చిన, అట్లనా, అవ్వ, నాయిన, అప్పయ్య, జర ఆగు, షానా(చాలా), పైలం, బువ్వ అనే పదాలు వాడుతుంటాం. మీరెలా మాట్లాడుతారో కామెంట్ చేయండి.

error: Content is protected !!