News February 18, 2025

NTPCలో 400 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు

image

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(NTPC) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన 400అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌(ఆపరేషన్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. 40శాతం మార్కులతో బీఈ, బీటెక్‌(మెకానికల్‌, ఎలక్ట్రికల్‌) పాసై 35ఏళ్లలోపు వయసున్న వారు అర్హులు.రిజర్వేషన్లు అనుసరించి గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు మార్చి 1లోపు careers.ntpc.co.in/recruitment/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Similar News

News March 15, 2025

ఉద్యోగాల విషయంలో దేశ చరిత్రలో మాదే రికార్డు: CM

image

TGPSCని గత BRS ప్రభుత్వం సర్వనాశనం చేసిందని సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘డిసెంబర్ 3, 2023 నుంచి ఇప్పటివరకు 57,924 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. ఇది దేశ చరిత్రలోనే రికార్డు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమూ ఈ ఘనత సాధించలేదు. 2023 జులై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9% ఉంటే 2024 జులై నుంచి సెప్టెంబర్ వరకు 18.1 శాతానికి తగ్గింది. ఇవన్నీ మా కష్టానికి ప్రతిఫలం’ అని అసెంబ్లీలో చెప్పారు.

News March 15, 2025

జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్?

image

నిన్న పవన్ వ్యాఖ్యలను బట్టి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్, త్రిభాషా విధానం, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో హిందువులపై దాడులు, గోద్రా మారణహోమంపై జనసేనాని మాట్లాడారు. తాను మహారాష్ట్ర, హరియాణాకు ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ఘనస్వాగతం లభించిందని పేర్కొన్నారు. పవన్ దేశానికి ఉపయోగపడేలా ఎదగాలని నాదెండ్ల మనోహర్ సైతం వ్యాఖ్యానించారు. దీనిపై మీ కామెంట్?

News March 15, 2025

ఖమ్మం: Way2Newsలో కథనం.. అ.కలెక్టర్ పరిశీలన

image

‘సాగు నీళ్లు కరవై.. పొలం బీళ్లై’ శీర్షికన Way2Newsలో ఈరోజు పబ్లిష్ అయిన కథనానికి అదనపు కలెక్టర్ శ్రీజ స్పందించారు. ముదిగొండ మండలంలోని కమలాపురం గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, మాట్లాడారు. చివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలను మండల అధికారులు ఉన్నతాధికారులకు నివేదించాలని, తద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఆమె వెంట మండల అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!