News August 9, 2025

TGలో రూ.80వేల కోట్ల పెట్టుబడికి NTPC సుముఖత

image

TG: CM రేవంత్‌తో NTPC CMD గుర్‌దీప్ సింగ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడికి సుముఖత వ్యక్తం చేశారు. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో రూ.80,000 కోట్ల మేర పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శించారు. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ద్వారా 6700 మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఉందని వివరించగా, అన్ని విధాలా సహకరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

Similar News

News August 10, 2025

నేడు బెంగళూరులో పర్యటించనున్న మోదీ

image

నేడు ప్రధాని మోదీ బెంగళూరు మెట్రోరైలు ఎల్లో లైన్, వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. దాదాపు 4 గంటలపాటు ప్రధాని పర్యటన కొనసాగనుంది. ఉ.10.30గం.కు ఆయన బెంగళూరు చేరుకుంటారు. హెలికాప్టర్, రోడ్డు మార్గంలో KSR బెంగళూరు సిటీ జంక్షన్ రైల్వేస్టేషన్‌కు వెళ్తారు. అక్కడ KSR బెంగళూరు-బెలగావి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత RVరోడ్ మెట్రో స్టేషన్‌ నుంచి ఎల్లో లైన్‌‌ను ప్రారంభిస్తారు.

News August 10, 2025

మహేశ్-రాజమౌళి మూవీ.. ఫ్యాన్‌మేడ్ పోస్టర్ చూశారా?

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు-రాజమౌళి సినిమా నుంచి నిన్న <<17349947>>అప్డేట్<<>> వచ్చిన విషయం తెలిసిందే. మెడలో త్రిశూలంతో ఉన్న పోస్టర్‌ను రాజమౌళి రిలీజ్ చేశారు. కానీ అందులో మహేశ్ ఫేస్ చూపించలేదు. దీంతో ఓ అభిమాని ఆ పోస్టర్‌కు AIతో మహేశ్ మాస్ లుక్‌ యాడ్ చేశాడు. ఈ లుక్‌ అదిరిపోయిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీరేమంటారు? అటు నవంబర్‌లో మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇస్తామని రాజమౌళి ప్రకటించారు.

News August 10, 2025

ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లేదు!

image

AP: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం మరో 5 రోజుల్లో ప్రారంభం కానుంది. కాగా ఈ పథకం కింద తిరుమల, శ్రీశైలం, పాడేరు వంటి ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదని తెలుస్తోంది. నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ ఉండదు. అలాగే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మధ్య తిరిగే ఇంటర్ స్టేట్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం కల్పించకూడదని సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.