News March 29, 2025

NTRకు బ్రహ్మరథం పట్టిన బాపట్ల జిల్లా

image

సరిగ్గా 43 ఏళ్ల క్రితం ఇదే రోజున(1982 మార్చి 29న) NTR టీడీపీని స్థాపించారు. ఆ తర్వాత 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. రేపల్లెలో ఎడ్ల వెంకట్రావు, వేమూరులో నాదెండ్ల భాస్కరరావు, బాపట్లలో సీవీ రామరాజు, చీరాలలో చిమట సాంబు, పర్చూరులో దగ్గుబాటి చౌదరి, అద్దంకిలో బాచిన చెంచు గరటయ్య టీడీపీ MLAలుగా గెలిచారు.

Similar News

News April 23, 2025

NRPT: ‘రిసోర్స్ పర్సన్‌ల ఎంపికకు దరఖాస్తు చేసుకోండి’

image

నారాయణపేట జిల్లాలో మండల స్థాయి, జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్‌ల ఎంపికకు ఆసక్తి గల ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని DEO గోవిందరాజు మంగళవారం ప్రకటనలో కోరారు. ఎస్జిటీ, స్కూల్ అసిస్టెంట్, గెజిటెడ్ హెడ్మాస్టర్, ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ లు ఈనెల 24 లోపు డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. జిల్లాలో గుణాత్మక విద్యను అమలు చేయుటకు ఉపాధ్యాయులకు అందించే శిక్షణలకు వీరిని ఉపయోగించుకుంటారని అన్నారు.

News April 23, 2025

 స్టేట్ టాపర్‌గా భూపాలపల్లి విద్యార్థి  

image

భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామానికి చెందిన వినయ్ ఇంటర్ ప్రథమ సంవత్సరం(MPC)లో 470కి 468 మార్కులు సాధించి స్టేట్ టాపర్‌గా నిలిచాడు. కమలాపూర్ MJP కళాశాలలో చదువుతున్న వినయ్‌కు గ్రామస్థులు, జిల్లా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అతని కృషి, పట్టుదల యువతకు స్ఫూర్తిగా నిలిచాయి.

News April 23, 2025

బాలానగర్‌: ‘8 K.M నడిచి.. 434 మార్కులు సాధించిన గిరి పుత్రిక’

image

బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ విభాగంలో హేమలత.. 434/440 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు నిరుపేదలు. వ్యవసాయం జీవనం సాగిస్తున్నారు. హేమలత ప్రతిరోజు.. కళాశాలకు ఉదయం 4 కి.మీ, సాయంత్రం 4.K.M నడుస్తూ.. కళాశాలకు వచ్చి చదువుకొని అత్యధిక మార్కులు సాధించడంతో కళాశాల ప్రిన్సిపల్ రమేష్ లింగం, కళాశాల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు.

error: Content is protected !!