News January 18, 2025

NTRకు భారతరత్న ఇచ్చేలా కేంద్రంతో చర్చలు:  లోకేశ్ 

image

రాజకీయాల్లోకి వచ్చిన 9నెలల్లో ప్రభంజనం సృష్టించి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో తల్లి భువనేశ్వరితో కలిసి లోకేశ్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు తలెత్తుకు తిరిగేలా చేశారని కొనియాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.

Similar News

News February 16, 2025

తెనాలి: రైలు ఢీకొని మహిళ దుర్మరణం

image

తెనాలి మండలం కొలకలూరు రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగింది. పట్టాలు దాటుతుండగా కొలకలూరుకు చెందిన పద్మావతి(55) అనే మహిళను సూపర్ ఫాస్ట్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. విజయవాడ నుంచి ఒంగోలు వెళ్లే ప్యాసింజర్ ఎక్కేందుకు వచ్చిన పద్మావతి స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టినట్లు తెలుస్తోంది. 

News February 16, 2025

మంగళగిరి: 5 కిలోల బంగారు ఆభరణాల చోరీ

image

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద 5 కిలోల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. వాటి విలువ ఐదు కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. బంగారు ఆభరణాలు సంచితో జ్యువెలరీలోని గుమస్తా దీవి నాగరాజు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు.అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు సంచిని గుర్తుతెలియని యువకులు లాక్కుని పారిపోయారు. ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 16, 2025

అధికారులకు GNT జేసీ ఆదేశాలు

image

గ్రూప్2 మెయిన్స్ పరీక్ష కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ఆదేశించారు. మెయిన్స్ పరీక్ష ఈనెల 23వ తేదీన జరుగుతుందని చెప్పారు.‌ ఇందుకోసం జిల్లాలో 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పరీక్షకు 9,277 అభ్యర్ధులు హాజరవుతారని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.

error: Content is protected !!