News May 19, 2024
NTRను కలిసేందుకు ఖమ్మం నుంచి HYDకి నడక

హీరో జూనియర్ NTRను కలవాలనే కోరికతో ఓ అభిమాని పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్కు వచ్చాడు. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం గోపాయిగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రబాబు చెప్పుల్లేకుండా 300 కిలోమీటర్లు నడిచాడు. తనను చూసేందుకు ఎంతో శ్రమించి ఇంటికి వచ్చిన నాగేంద్రను కలిసిన ఎన్టీఆర్ అతడితో ఫొటో దిగాడు. అభిమాన హీరో కలవడంతో అతడు తెగ సంబరపడుతున్నాడు.
Similar News
News October 15, 2025
ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం: రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో వానాకాలం పంటల మద్దతు ధర గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ ఏడాది క్వింటాలు గ్రేడ్ ఏ ధాన్యానికి ₹2389, పత్తికి ₹8110 మద్దతు ధర నిర్ణయించినట్లు చెప్పారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా సీసీఐ కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు.
News October 15, 2025
కార్తిక సోమవారం.. పంచారామాలకు ప్రత్యేక బస్సు

ఖమ్మం: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం RTC ఖమ్మం విభాగం ప్రత్యేక సర్వీసును ప్రకటించింది. ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, పాలకొల్లు, సామర్లకోటకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతోంది. ఈ నెల 26న రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరుతుంది. టికెట్ ధర పెద్దలకు రూ.2,300, పిల్లలకు రూ.1,200గా నిర్ణయించామని, వివరాలకు 91364 46666 నెంబర్ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
News October 15, 2025
ఆ నాలుగు మండలాల్లోనే వర్షపాతం నమోదు.!

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 8:30 వరకు గడిచిన 24 గంటల్లో 9.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. కూసుమంచి మండలంలో 4.8, తల్లాడ మండలంలో 2.4, రఘునాథపాలెం మండలంలో 1.4, ఖమ్మం రూరల్ మండలంలో 1.0 మిల్లీమీటర్లు నమోదైనట్లు చెప్పారు. కాగా ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.