News December 19, 2025

NTR‌లో చైల్డ్ కేర్ సెంటర్ ఏది..? పసికందుల పరిస్థితి దయనీయం..!

image

పసి పిల్లలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చిలో ఆరుగురు పిల్లలు, తాజాగా ఐదుగురిని కాపాడారు. అయితే పిల్లలను ఉంచేందుకు NTRలో ఒక్క చైల్డ్ కేర్ భవనం కూడా లేకపోవడం దారుణం. కృష్ణా (D) బుద్దవరానికి తరలించారు. ఓ బాలుడు కాలేయ వ్యాధితో బాధపడుతున్నా వైద్యం అందని పరిస్థితి. దత్తతకు నిబంధనలు అడ్డొస్తుండటంతో, అరకొర వసతుల మధ్యే పిల్లలు మగ్గుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Similar News

News December 25, 2025

ప.గో: ఆటవిడుపు విషాదాంతం.. నీటిలో విగతజీవిగా బాలుడు

image

పెనుగొండలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని పార్కులో గురువారం మధ్యాహ్నం ఆడుకుంటూ అదృశ్యమైన పదేళ్ల బాలుడు.. రాత్రికి సమీపంలోని చెరువులో విగతజీవిగా లభ్యమయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం గాలించిన స్థానికులు, చెరువులో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News December 25, 2025

త్వరలో కొత్త మెయిల్ ఐడీలు! గూగుల్ కీలక నిర్ణయం

image

త్వరలో జీమెయిల్ యూజర్ ఐడీ మార్చుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు గూగుల్ వెల్లడించింది. కొత్త యూజర్ ఐడీతోపాటు పాత ఐడీ యాక్టివ్‌గానే ఉంటుందని, ఇన్‌బాక్స్ ఒకటేనని తెలిపింది. పాత ఐడీ మళ్లీ పొందాలంటే 12నెలలు ఆగాల్సిందేనని చెప్పింది. జీమెయిల్ అకౌంట్‌తో లింకైన ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఆధార్ యూజర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఈ ఫీచర్‌ దశలవారీగా అమలులోకి వస్తుందని తెలిపింది.

News December 25, 2025

కదిరి: ప్రమాదంలో వ్యక్తి స్పాట్‌డెడ్

image

కదిరి మున్సిపాలిటీ పరిధిలో కుటాగుళ్ల-పులివెందుల క్రాస్ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కదిరి రూరల్ పరిధిలోని కాళసముద్రంకు చెందిన రాజును గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయిందన్నారు. అధికంగా రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. పోలీసులు విచారణ చేపట్టారు.