News March 26, 2025
NTR: అన్న క్యాంటీన్లను పరిశీలించిన కమిషనర్

విజయవాడ వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లను మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విజయవాడ సింగ్‌నగర్ టిక్కల్ రోడ్డు ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఆయన అన్న క్యాంటీన్లో భోజన వసతులను వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్లో వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.
Similar News
News December 10, 2025
నెల్లూరు కలెక్టర్‌కు 2వ ర్యాంకు

నెల్లూరు కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ పాలన చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆయన 682 ఫైల్స్ స్వీకరించారు. ఇందులో 628 క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్‌ను 17 గంటల వ్యవధిలోనే క్లియర్ చేయడంతో ఆయనను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. దీంతో ఫైల్ క్లియరెన్స్‌లో మన కలెక్టర్‌కు సీఎం రాష్ట్రంలోనే 2వ ర్యాంకు ఇచ్చారు.
News December 10, 2025
HYDలో నైట్ లైఫ్‌కు కేఫ్ కల్చర్ కిక్

HYD టెక్ స్టూడెంట్స్, క్రియేటర్స్ ‘కేఫ్ కల్చర్’ని కొత్త అడ్డాగా మార్చుకున్నారు. పగలు లాప్‌టాప్‌లతో కో-వర్కింగ్ సెంటర్లుగా, నైట్ బోర్డ్ గేమ్స్, ఓపెన్ మైక్స్, ఇండీ మ్యూజిక్ గిగ్స్‌తో సందడి చేస్తున్నారు. PUBలకు భిన్నంగా ఈ హాట్స్పాట్లు ఉంటాయి. వైన్-డైన్‌కు బదులు కాఫీ, ఫుడ్‌తో యూత్‌ని ఆకర్షిస్తున్నాయి. మద్యం లేకుండా క్రియేటివిటీ, కమ్యూనిటీతో మజా డబుల్ అవుతోంది. దీన్నే స్టడీ పార్టీ అని పిలుస్తున్నారు.
News December 10, 2025
ఉమ్మడి నల్గొండ జిల్లా మొదటి విడత గ్రామ పంచాయతీల అప్డేట్

నల్గొండ, చండూరు డివిజన్లలో 14 మండలాల్లో 296 పంచాయతీలు, 2,491 వార్డులు. పోలింగ్ కేంద్రాలు: 2870, పోలింగ్ సిబ్బంది: 7892. సూర్యాపేట డివిజన్లోని 8 మండలాల్లో 152 పంచాయతీలు, 1,241 వార్డులు. పోలింగ్ కేంద్రాలు: 1403, పోలింగ్ సిబ్బంది: 4,402. భువనగిరి డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో 137 పంచాయతీలు, 1040 వార్డులకు రేపు పోలింగ్ జరుగనుంది.


