News February 5, 2025

NTR: అలర్ట్.. పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో నవంబర్- 2024లో నిర్వహించిన స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.

Similar News

News February 6, 2025

ఉమ్మడి MBNR జిల్లాలో రైతు భరోసా జమ.!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాకు 78,403 రైతులకు గాను రూ.38,15,09,916 జమయ్యాయి. NRPTకు 45,717 రైతులకు గాను రూ.26,94,06,431, NGKLకు 78,490 రైతులకు గాను రూ.44.79.99.371 జమయ్యాయి. వనపర్తి జిల్లాకు 60,239 రైతులకు గాను రూ.28,02,01,581, గద్వాలకు 37,352 రైతులకు గాను రూ.23,86,06,138 అధికారులు జమ చేశారు.

News February 6, 2025

ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ సత్తా చాటాలి: రేగా కాంతారావు

image

ఇల్లందు: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది జిల్లాలోనే కాదు రాష్ట్రంలో సత్తా చాటాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఇలా ఏ ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

News February 6, 2025

త్రివేణీ సంగమంలో నంద్యాల ఎంపీ పుణ్య స్నానం 

image

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. ఇక్కడ పవిత్ర స్నానం ఆచరించడం తన పూర్వ జన్మ సుకృతం అని ఆమె తెలిపారు. అక్కడ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఈ మహా కుంభమేళాకు జిల్లా నుంచి సైతం భక్తులు తరలివెళ్తున్నారు. 

error: Content is protected !!