News February 5, 2025
NTR: అలర్ట్.. పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో నవంబర్- 2024లో నిర్వహించిన స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.
Similar News
News March 22, 2025
ఫారంపాండ్‌తో రైతులకు ఎంతో ప్రయోజనం: కలెక్టర్

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కూడేరు మండలం చోళ సముద్రంలో రైతు ఎర్రస్వామి పొలంలో ఫారంపాండ్ ఏర్పాటుకు సంబంధించి భూమిపూజ పనులను శనివారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఫారంపాండ్ పనులకు భూమిపూజ చేశామన్నారు. ఫారంపాండ్‌తో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.
News March 22, 2025
నిజామాబాద్ జిల్లాకు రేపు ముఖ్యమంత్రి రాక..!

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్‌పల్లిలోని ఇందూరు తిరుమలలో వార్షిక బ్రహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం జరిగే స్వామివారి కల్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఈ విషయమై భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులు, పోలీసులు చర్చిస్తున్నట్లు సమాచారం.
News March 22, 2025
అంతరిక్ష కేంద్రం భూమిపై కూలుతుందా?

ఎన్నో అంతరిక్ష ప్రయోగాలకు వేదికైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) భూమి నుంచి 415 కి.మీల ఎత్తులో ఉంది. 2031లో ఈ ISS మిషన్ పూర్తవనుంది. దీంతో 109 మీటర్ల పొడవున్న ISS తన కక్ష్య నుంచి పూర్తిగా వైదొలిగి భూమి దిశగా రానుంది. ఈక్రమంలో అట్మాస్పిరిక్ డ్రాగ్ ప్రభావంతో ISS తనంతట తాను ధ్వంసం అయ్యేలా NASA చేయనుంది. మిగిలిన భాగాలు పసిఫిక్ సముద్రంలోని ‘పాయింట్ నెమో’ (అంతరిక్ష వ్యర్థాల వాటిక)లో పడేలా చేస్తారు.